Sanju Samson: కీపర్ నే కాదు మంచి ఫీల్డర్ ని కూడా.. బిసిసిఐపై సంజు అసహనం

* సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంజు శాంసన్ ట్విట్టర్ పోస్ట్

Update: 2021-11-10 11:20 GMT

Sanju Samson: కీపర్ నే కాదు మంచి ఫీల్డర్ ని కూడా.. బిసిసిఐ పై సంజు అసహనం

Sanju Samson: భారత క్రికెటర్ సంజు శాంసన్ తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నిరాశ వ్యక్తం చేశాడు. మంగళవారం భారత సెలక్షన్ కమిటీ త్వరలో కివీస్ తో టీ20 సిరీస్ కి 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే కీపర్ గా ఇషాన్ ఇషాన్ తో పాటు రిషబ్ పంత్ కి స్థానం కల్పించిన సెలక్షన్ కమిటీ సంజు శాంసన్ ని పక్కనపెట్టింది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ 2021 లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తనని ఎందుకు జట్టులోకి తీసుకోకపోవడంతో అభిమానులు సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంజు శాంసన్ మాత్రం తాను కేవలం కీపర్ మాత్రమె కాదని మంచి ఫీల్డర్ ని కూడా అని గుర్తు చేస్తూ తాను బౌండరీ వద్ద క్యాచ్ లను పట్టిన ఫోటోలను షేర్ చేశాడు. తాజా సంజు పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జింబాబ్వేతో 2015 లో టీమిండియా తరపున సంజూ శాంసన్‌ టీ20లో అరంగేట్రం చేయగా ఇప్పటివరకు మొత్తం 10 టీ20 మ్యాచ్ లు ఆడిన సంజు శాంసన్‌ 110.37 సగటుతో 117 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 27. ప్రస్తుతం ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజు శాంసన్‌ ఇప్పటి వరకు భారత్ తరపున ఒక వన్డే మ్యాచ్ ఆడి 46 పరుగులు చేయగా టెస్టు క్రికెట్ లో ఇప్పటికి ఎంట్రీ ఇవ్వలేదు.


Tags:    

Similar News