PBKS vs RCB: పంజాబ్ పై ఆర్సీబీ ఘన విజయం
PBKS vs RCB: ప్లే ఆప్స్ రేసు నుంచి కింగ్స్ నిష్క్రమణ
PBKS vs RCB: పంజాబ్ పై ఆర్సీబీ ఘన విజయం
PBKS vs RCB: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ టీం ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. తొలుత విరాట్ కోహ్లీ 92 పరుగులతో విరుచుకుపడ్డారు. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్ ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఆర్సీబీ దాటికి రుసో ఒక్కడే ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. పంజాబ్ ఎంత కష్టపడినప్పటికీ లాభం లేకుండా పోయింది. 17 ఓవర్ల దగ్గరనే ఆలౌట్ గా నిలిచింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ సజీవంగా నిలిచాయి. పంజాబ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.