Rohit Sharma: రోహిత్ శర్మపై యాక్షన్ మోడ్ లో బీసీసీఐ.. టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ కన్ఫామేనా?

Rohit Sharma: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

Update: 2025-02-16 06:04 GMT

Rohit Sharma: రోహిత్ శర్మపై యాక్షన్ మోడ్ లో బీసీసీఐ.. టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ కన్ఫామేనా?

Rohit Sharma: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును 3-1 తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీని తర్వాత రోహిత్ శర్మపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ త్వరలో ముగియవచ్చని చాలా మంది భావించారు. అయితే, రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.

రోహిత్ శర్మపై యాక్షన్ మూడ్‌లో బీసీసీఐ సెలెక్టర్లు!

భారత జట్టులో త్వరలో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ త్వరలో ముగియవచ్చు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతుంది. ఈ పర్యటనలో భారత జట్టు 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేసే మూడ్‌లో భారత సెలెక్టర్లు లేరని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రోహిత్ శర్మను టెస్ట్ జట్టు నుంచి తొలగిస్తే జట్టును ఎవరు నడిపిస్తారు? మీడియా నివేదికల ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ కావడం దాదాపు ఖాయం.

టెస్ట్ ల నుంచి రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ ఏమన్నాడు?

ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా నడుం నొప్పితో బాధపడుతున్నాడు.. కానీ తిరిగి వచ్చిన తర్వాత అతను టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగలడని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఓటమి తర్వాత, రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశ్యం లేదని చెప్పాడు. అయితే, ఇప్పుడు రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌కు సంబంధించిన సమాచారం బయటకు వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్ట్ కాడని తెలుస్తోంది.

Tags:    

Similar News