Rohit Sharma: 8 ఏళ్ల కిందటి యువరాజ్ ను గుర్తు చేసిన రోహిత్ శర్మ సెంచరీ

Rohit Sharma: అదే నగరం, అదే సేడియం.. వాతావరణం 8 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది.

Update: 2025-02-10 04:43 GMT

Rohit Sharma: 8 ఏళ్ల కిందటి యువరాజ్ ను గుర్తు చేసిన రోహిత్ శర్మ సెంచరీ

Rohit Sharma: అదే నగరం, అదే సేడియం.. వాతావరణం 8 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తేడా ఏమిటంటే అక్కడ ఒక్క ఆటగాడు మాత్రమే మారాడు. 8 సంవత్సరాల క్రితం కటక్ మైదానంలో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు. కానీ ఇప్పుడు అది రోహిత్ శర్మ. అప్పుడు కూడా యువరాజ్ ఆ సెంచరీ చేసిన సమయానికి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అతను సెంచరీ చేసిన జట్టు కూడా ఇంగ్లాండే. 2017లో యువరాజ్ సెంచరీ సాధించాడు. కానీ 2025 ఫిబ్రవరి 9న కటక్‌లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ కథ కూడా సరిగ్గా అలాగే ఉంది. అందుకే రోహిత్ పరిస్థితి యువరాజ్ లాగా మారుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

2017 లో యువరాజ్ కి ఏమైంది?

రోహిత్ శర్మ విషయానికి వచ్చే ముందు.. 2017 లో యువరాజ్ సింగ్ కు ఏమి జరిగిందో తెలుసుకుందాం. అతని వన్డే కెరీర్ ముగిసిన సంవత్సరం ఇదే. అతను తన వన్డే కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. అది కూడా కటక్‌లో ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసిన తర్వాత 5 నెలల్లోనే తను క్రికెట్ కు దూరం అయ్యాడు. జనవరి 19, 2017న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. కటక్‌లో ఇంగ్లాండ్‌పై 150 పరుగులు చేసిన తర్వాత, యువరాజ్ సింగ్ అదే సంవత్సరం జూన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి వెళ్ళాడు. కానీ ఆ ICC టోర్నమెంట్‌లో అతడు రాణించలేకపోయాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ 5 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 35 సగటుతో 105 పరుగులు మాత్రమే చేశాడు. ఆ టోర్నమెంట్‌లో అతని అత్యుత్తమ స్కోరు కేవలం 53 పరుగులు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌లో యువరాజ్‌కు అవకాశం లభించింది. అతను జూన్ 30న కరేబియన్ గడ్డపై తన చివరి వన్డే ఆడాడు.

యువరాజ్ పరిస్థితి వచ్చేనా ?

కటక్‌లో సెంచరీ చేసి 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన తర్వాత, యువరాజ్ సింగ్ వన్డే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు రోహిత్‌కి కూడా అదే జరుగుతుందేమో అని ఆందోళన అభిమానుల్లో మొదలైంది. ఎందుకంటే అతని కెరీర్ పై కూడా కత్తి ఇప్పటికే వేలాడుతోంది. యువీ లాగే, రోహిత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కటక్‌లో సెంచరీ చేశాడు. అందుకే అభిమానుల మనసుల్లో ఈ ప్రశ్న మరింత ప్రబలంగా మారింది.

Tags:    

Similar News