IPL 2021 Rohit Sharma: రోహిత్ శర్మకు 12 లక్షలు జరిమానా

IPL 2021 Rohit Sharma: స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా విధించారు.

Update: 2021-04-21 07:53 GMT

Rohit Sharma fined in IPL 2021: (Photo Twitter)

IPL 2021 Rohit Sharma: మంగళవారం రాత్రి చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ. 12 లక్షల జరిమానా విధించారు. మరోసారి కూడా ఇలాంటి ఉల్లంఘనే నమోదైతే అప్పుడీ జరిమానా రూ. 24 లక్షలకు పెరుగుతుంది. అంతేకాదు, జట్టు కెప్టెన్ సహా ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు.

మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్‌కు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. అంతేకాక రూ. 30 లక్షల జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్ ధోనీ ఇప్పటికే ఈ జరిమానా ఎదుర్కొన్నాడు. కాగా, గతరాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విపలమై ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై రెండింటిలో ఓటమి పాలైంది.

ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయిపై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన. అమిత్‌ మిశ్రా (4/24) అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. లక్ష్యం చిన్నదే అయినా దీన్ని ఛేదించడానికి దిల్లీ చెమటోడ్చింది. శిఖర్ ధావన్‌ (45; 42 బంతుల్లో 5×4, 1×6), స్మిత్ (33; 29 బంతుల్లో 4×4), లలిత్‌ యాదవ్ (22 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4) రాణించడంతో దిల్లీ..లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Tags:    

Similar News