Rishabh Pant: కరోనా నుండి కోలుకున్న రిషబ్ పంత్

Update: 2021-07-19 14:48 GMT

రిషబ్ పంత్ (ఫైల్ ఫోటో)

Rishabh Pant: భారత క్రికెట్ యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ తాజాగా కరోనా నుండి కోలుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత భారత జట్టు ఆటగాళ్లకు భారత క్రికెట్ బోర్డు కాస్త విరామం ఇవ్వడంతో బయో బబుల్ వీడిన ఆటగాళ్లు దాదాపుగా 15 రోజుల పాటు ఇంగ్లండ్ లోని కొన్ని ప్రదేశాలతో పాటు పలు ఫుట్ బాల్ మ్యాచ్ లను వీక్షించడానికి వెళ్లారు. ఆ సమయంలో భారత ఆటగాడు రిషబ్ పంత్ కూడా గత నెల 30 వ తారీకున లండన్ లో జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ కి హాజరయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత కొన్ని రోజులకి జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న రిషబ్ పంత్ కి పాజిటివ్ అని తెలిసింది. దీంతో వెంటనే ఐసోలేషన్ కి వెళ్ళిన రిషబ్ పంత్ తాజాగా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చింది.

ఇక దీంతో మరో రెండు రోజుల్లో డర్హంలో జరగనున్న ప్రాక్టీసు మ్యాచ్ కోసం భారత జట్టుతో రిషబ్ పంత్ కలవనున్నాడు. మరోపక్క రిషబ్ తో పాటు వృద్ధిమాన్ సాహా కూడా ప్రస్తుతం కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం కే ఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక రిషబ్ పంత్ జూలై 28న జరగబోయే ప్రాక్టీసు మ్యాచ్ కి అందుబాటులో ఉండనున్నాడని భారత జట్టు వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఆగష్టు నెల 4వ తేదీ నుండి భారత్ ఇంగ్లాండ్ ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News