ICC Rankings: మరోసారి దుమ్ములేపిన రిషభ్ పంత్.. గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా!
ఇంగ్లాండ్‌తో జరిగిన లీడ్స్ టెస్ట్‌లో రిషభ్ పంత్ అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి తన సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన పంత్, టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానం నుంచి ఆరో స్థానానికి ఎదిగాడు.
ICC Rankings: మరోసారి దుమ్ములేపిన రిషభ్ పంత్.. గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా!
ICC Rankings: ఇంగ్లాండ్‌తో జరిగిన లీడ్స్ టెస్ట్‌లో రిషభ్ పంత్ అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి తన సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన పంత్, టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానం నుంచి ఆరో స్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం అతని రేటింగ్ పాయింట్లు 801గా ఉండగా, ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో లీడ్స్ మ్యాచ్ భారత్ చేతిలో పోయినా, పంత్ వ్యక్తిగతంగా మాత్రం ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. పంత్ ఈ రెండు శతకాలతో భారత స్కోర్ బోర్డును నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ర్యాంకింగ్ ఎగబాకడానికి మరొక కారణం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండటమే. ఆయన ర్యాంక్ తగ్గిపోవడంతో, పంత్ ఆరో స్థానానికి వెళ్లే అవకాశం దక్కింది.
ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హెడింగ్లీ టెస్ట్‌లో 28, 53(నాటౌట్) పరుగులు చేసి, 889 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
పంత్ ప్రదర్శన చూసిన తర్వాత క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అందరూ ఒకే మాట చెబుతున్నారు – ‘‘ఈ యువ వికెట్ కీపర్ ఇంకా చాలా ఎత్తులకు ఎదుగుతాడు!’’