Rinku Singh: అలీఘడ్‌లో డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన రింకు సింగ్.. వీడియో వైరల్
Rinku Singh: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం రింకు సింగ్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. అంతకు ముందే రింకు సింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తను డబ్బు పంచుతూ కనిపిస్తున్నాడని చెబుతున్నారు. రింకు సింగ్ అలీఘర్‌లో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రింకు సింగ్ డబ్బు పంపిణీ చేశాడని వైరల్ వీడియో ద్వారా ప్రచారం జరిగింది.
టీం ఇండియా ప్లేయర్ రింకు అలీఘర్‌లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. దీనికోసం ఆయన గృహప్రవేశ వేడుక నిర్వహించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. రింకు ఆ డబ్బును చెఫ్స్, అతని వద్ద పనిచేసే ఇతరులకు పంచాడు. దాని వీడియోలు చాలా వరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై రింకు సింగ్ నుండి ఎటువంటి స్పందన రాలేదు.
This man worth is more than 13 cr. Rinku Singh 🥺🫶♥️ pic.twitter.com/v3vDpbJw8v
— mufaddla parody (@mufaddl_parody) January 18, 2025
జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కోసం రింకూ సింగ్ టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుంది. దీని తర్వాత రెండవ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఈ మ్యాచ్ జనవరి 25న జరుగుతుంది. మూడవ మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లో, నాల్గవ మ్యాచ్ జనవరి 31న పూణేలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది.
రింకు ఇప్పటివరకు భారతదేశం తరపున 2 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను టీ20 మ్యాచ్‌ల్లో 507 పరుగులు చేశాడు. అక్కడ తను మూడు అర్ధ సెంచరీలు చేశారు. రింకు ఐపీఎల్‌లో 45 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 893 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.