Ricky Ponting: భారత కోచ్ గా నన్నే అడిగారు.. ద్రావిడ్ ఎలా ఒప్పుకున్నాడో..!?

* తీవ్ర ఒత్తిడి ఉంటుందనే కోచ్ పదవికి నో చెప్పా: పాంటింగ్ * ద్రావిడ్ ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది : పాంటింగ్

Update: 2021-11-19 12:43 GMT

Ricky Ponting: టీమిండియా కోచ్ గా నన్నే అడిగారు.. ద్రావిడ్ ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది 

Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియాకి కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకి కోచ్ గా తననే ముందుగా అడిగారని కాని తాను భారత జట్టు కోచ్ గా అంత సమయం కేటాయించలేనని, టీమిండియా కోచ్ అంటే విశ్రాంతి అసలు ఉండదని వరుస షెడ్యుల్ లతో బిజీబిజీగా గడపాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు భారత అండర్ 19 జట్టుకు కోచ్ గా ఆనందంగా, ప్రశాంతంగా ఉన్న రాహుల్ ద్రావిడ్.. టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందన్నాడు.

రాహుల్ ద్రావిడ్ కి బహుశా చిన్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నానని, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న టీమిండియా కోచ్ పదవిని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయమని చెప్పకనే చెప్పాడు. ఇక టీ20 ప్రపంచకప్ తరువాత సొంత గడ్డపై కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ తో కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ కోచ్ గా మొదటి టీ20 విజయంలో కీలక పాత్ర పోషించాడు. రానున్న కాలంలో భారత జట్టుకు కోచ్ గా మరిన్ని విజయాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News