IPL 2025: ధోనీని రమ్మని పిలిచినా రాలేదు.. కానీ అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు

Update: 2025-03-17 16:00 GMT

ధోనీని నా 100వ టెస్టుకు రమ్మని పిలిచినా రాలేదు.. కానీ అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు 

Ravichandran Ashwin about MS Dhoni: రవిచంద్రన్ అశ్విన్... ఇప్పటివరకు ఎంతో మంది ఆల్ రౌండర్స్ టీమిండియాను రిప్రజెంట్ చేశారు. కానీ వారిలో రవిచంద్రన్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎంఎస్ ధోనీ గురించి, చెన్నై సూపర్ కింగ్స్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ గురించి అశ్విన్ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

నేను పిలిచినా ధోనీ రాలేదు

రవిచంద్రన్ అశ్విన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. కానీ వాస్తవానికి ఆయన అంతకంటే చాలాముందే రిటైర్ అవ్వాలని అనుకున్నారట.

2024 మార్చ్ మొదటి వారంలో ధర్మశాలలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. అది రవిచంద్రన్ కెరీర్లో 100 వ టెస్ట్ మ్యాచ్. తనకు ఎంతో ప్రత్యేకమైన మ్యాచ్. బీసీసీఐ కూడా అశ్విన్ కు మెమెంటో ఇచ్చేందుకు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.

"ఆ మెమెంటోనూ ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని ఆశపడ్డాను. అందుకే ఆ మ్యాచ్ కు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించాను. కానీ ధోనీ రాలేదు. దాంతో నా రిటైర్మెంట్ ప్లాన్ వాయిదా వేసుకున్నా. కానీ ఆ తరువాతే ధోనీ నాకు అంతకంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఐపిఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తనకు ఛాన్స్ ఇవ్వడం అనేది నేను ఊహించని గిఫ్ట్" అంటూ ధోనీతో తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.

100వ టెస్టుతో రిటైర్ అవుదాం అనుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రిటైర్ అయ్యేనాటికి భారత్ తరపున 106 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు.

10 ఏళ్ల తర్వాత మళ్ళీ చెన్నై జట్టులోకి...

2008 ఐపిఎల్ నుండి 2015 వరకు అశ్విన్ చెన్నై సుపర్ కింగ్స్ జట్టులోనే ఉన్నాడు. ఆ తర్వాత గత పదేళ్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లలో ఆడారు. ఇప్పుడు ధోనీ ప్రమేయంతో తనకు మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రీఎంట్రీ లభించిందని రవిచంద్రన్ అశ్విన్ తన సంతోషాన్ని పంచుకున్నారు. 

Tags:    

Similar News