IPL 2025: అలాంటి వాళ్లతో మాకు పని లేదు.. అశ్విన్ సంచలన కామెంట్స్!
IPL 2025: నిజమైన అభిమానులు తన వెనుక ఉన్నారని, అసహ్యపూరిత ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
IPL 2025: అలాంటి వాళ్లతో మాకు పని లేదు.. అశ్విన్ సంచలన కామెంట్స్!
IPL 2025: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాను ఎదుర్కొంటున్న విమర్శలపై స్పందించాడు. సీజన్ మొదటి దశలో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రోలింగ్‌కు బలవుతున్నాడు. ఐదు మ్యాచుల్లో అయిదు వికెట్లు తీసిన అశ్విన్, ఓవరుకు దాదాపు 10 పరుగుల చొప్పున ఇచ్చాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే అతడిని భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక తన తండ్రి కూడా బాగా ఆడకపోతే నన్ను మందలిస్తారని చెప్పాడు. ట్రోలింగ్‌లో కొంతలో అసహ్యం ఉండొచ్చు, కానీ నిజమైన అభిమానులది మాత్రం ప్రేమతో కూడిన స్పందన అనే ఉద్దేశంతో అశ్విన్ నిలదీసాడు. తాను హై ఇంటెన్సిటీ టోర్నీల్లో ఉండే సమయంలో పూర్తిగా సోషల్ మీడియా దూరంగా ఉంచుతానని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నప్పుడు కూడా అంతే చేశానని చెప్పారు. తనపై ట్రోలింగ్ చేస్తోన్న వారిలో చాలామందికి అసలు కారణమే తెలియదని అభిప్రాయపడ్డాడు. కేవలం కోపంతో లేదా ఫ్రస్ట్రేషన్‌తో అంతా చేస్తున్నారని అన్నారు.
ఆర్సీబీ అభిమానుల ప్రస్తావన చేస్తూ, వారికి ఉన్న లాయల్టీ గురించి దినేశ్ కార్తిక్‌తో జరిగిన సంభాషణను గుర్తుచేశాడు. ఆటగాళ్లు తప్పు చేయడానికి మైదానానికి రావడంలేదని, నిజమైన ఫ్యాన్స్ అంటే ఆటగాళ్లను గౌరవించి, అవసరమైతే సానుకూలమైన విమర్శలతో అర్థవంతంగా తిట్టడం అంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఈ నేపథ్యంలోనే అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెన్నై మ్యాచుల రివ్యూలు చేయడం ఆపేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా తనపై వస్తున్న విమర్శలకు కారణమవుతున్న వీడియోలను తొలగించుకోవడమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది.