IPL 2021: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు
IPL 2021: రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ విన్
పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఫైల్ ఇమేజ్)
IPL 2021: ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా కేవలం ఒకే పరుగు చేసి ఘోర ఓటమిని చవి చూసింది. రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. తొలి నుంచి పంజాబ్ విజయం దిశగా సాగినా చివరి ఓవర్ లో అంతా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌ఆర్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ కాగా ఛేదనలో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.