జోస్ బట్లర్ అద్భతమైన సెంచరీ.. రాజస్థాన్ ఫైనల్ కు.. బెంగళూరు ఇంటికి...

IPL 2022 - RR vs RCB Highlights: 158 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేదించిన రాజస్థాన్...

Update: 2022-05-28 01:15 GMT

జోస్ బట్లర్ అద్భతమైన సెంచరీ.. రాజస్థాన్ ఫైనల్ కు.. బెంగళూరు ఇంటికి...

IPL 2022 - RR vs RCB Highlights: ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ అద్భుతమైన సెంచరీ నమోదుచేశారు. ఈసీజన్లో ఇది నాలుగో సెంచరీ సాధించాడు. బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరా పోరులో బెంగళూరు జట్టు 157 పరుగు చేసింది. రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శనతో మూడు వికెట్లను కోల్పోయి 158 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. తొలినుంచి ధాటిగా ఆడిన బట్లర్... అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సిక్సర్, బౌండరీలతో పరుగుల ప్రవాహం పారించాడు. సిక్సర్ తో విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ‌ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

జోస్ బట్లర్ రాజస్థాన్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టువిజయాల్లో కీలక పాత్రపోషించాడు. 718 వ్యక్తిగత పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్లో అర్హతకోసం నిర్వహించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో జోస్ బట్ల విధ్వంసం సృష్టించాడు. 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్ పది బౌండరీలు, ఆరు సిక్సర్లతో 106 పరుగుసాధించి అజేయంగా నిలిచాడు. వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు సాధించడమేగాకుండా... జట్టువిజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో తలపడక ముందే... జోస్ బట్లర్ అత్యుత్తమ ఆటతీరుతో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు అర్హత సాధించాడు.

బెంగళూరు ఆటగాళ్లలో రాజత్ పటీదర్ 58 పరుగులు, కెప్టన్ డుప్లెసిస్ 25 పరుగులు, మ్యాక్స్ వెల్ 24 పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ రెండో ఓవర్లోనే పెవీలియన్ బాట పట్టడంతో అభిమానుల్ని నిరాశపరచాడు. బెంగళూరు ఆటగాళ్లు దూకుడుకు రాజస్థాన్ బౌలర్లు ప్రసిద్ధ క్రిష్ణ, మెకాయ్ తమబంతులతో కట్టడిచేయగలిగారు. ఇక రాజస్థాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 106 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టన్ సంజూ శాంసన్ 23 పరుగులు, యశస్వీజైస్వాల్ 21 పరుగుల నమోదుచేశారు. బెంగళూరు బౌలర్ల బంతుల్ని తుత్తునియలు చేసిన బట్లర్ పరుగుల వరద పారించాడి. రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్... రాజస్థాన్ రాయల్స్.. పోటీ పడబోతున్నాయి. ఐపీఎల్ ఆరంభ సీజన్లో సంచలన విజయాలతో ట్రోఫీని చేజిక్కించుకున్ రాజస్థాన్ ఫ్రాంఛైజీ రెండో సారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్వీళ్లూరుతోంది. ఈ సీజన్లో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతోంది. ఫైనల్ మ్యాచులో ఎవరు విజయభేరి మోగిస్తారోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News