IPL 2021 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 189

PL 2021 CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 9వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

Update: 2021-04-19 15:58 GMT

చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్

IPL 2021 CSK vs RR: ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ధోనీ సేన 20 ఓవర్లకు 9వికెట్లు కో్ల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై టీం రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనడంలో చాలా ఇబ్బందిపడ్డారు. తరచుగా వికెట్లు కోల్పోతూ... స్కోర్ బోర్డులో పరుగులు సాధించలేకపోయారు. ముస్తాఫిజుర్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతికి చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(13 బంతుల్లో 10; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. ముస్తాఫిజుర్‌ సంధించిన బంతి లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శివమ్‌ దూబే అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కాగా, రుతురాజ్‌ ప్రస్తుత సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా విఫలమాయ్యడు.

అనంతరం ఉనద్కత్‌ వేసిన 5వ ఓవర్‌లో 3 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 19 పరుగులు పిండుకున్న డుప్లెసిస్‌(17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు).. క్రిస్‌ మోరిస్‌ వేసిన మరుసటి ఓవర్లోనే(5.4 ఓవర్) ఔటయ్యాడు. మోరిస్‌ వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో రియన్‌ పరాగ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు.

ముస్తాఫిజుర్‌ వేసిన 7వ ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ సహా 13 పరుగులు రాబట్టిన మొయిన్‌ అలీ.. మోరిస్‌ వేసిన తరువాతి ఓవర్‌లో సైతం భారీ సిక్సర్‌ కొట్టి దూకుడుగా ఆడుతున్న మొయిన్‌ అలీ(20 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు) తెవాతియా ఉచ్చులో చిక్కాడు. తెవాతియా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన మొయిన్‌... రియాన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

వరుస సిక్సర్లతో విరుచుకుపడిన రాయుడు

రియాన్‌ పరాగ్‌ వేసిన 11వ ఓవర్‌లో సిక్సర్‌ బాది ఊపుమీదున్నట్లు కనిపించిన రాయుడు... తెవాతియా వేసిన 12వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో ఉన్న రైనా సైతం రియాన్‌ వేసిన 11వ ఓవర్‌లో భారీ సిక్సర్‌ కొట్లాడు. అనంతరం సకారియా వేసిన 14వ ఓవర్‌లో చెన్నై రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 13.2 బంతికి రాయుడు(27పరుగులు, 17 బంతులు, 3 సిక్సులు) ఔటవ్వగా, 13.5 బంతికి రైనా(15 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు.

మరోసారి ధోని విఫలం

వరుస ఓవర్లతో వికెట్లు కొల్పోతున్న చైన్నైటీంకు 17.2 ఓవర్లో మరో దెబ్బ తగిలింది. చేతన్ సకారియా బౌలింగ్ లో చైన్నై కెప్టెన్ ధోనీ(18 పరుగులు, 17 బంతులు, 2 ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తరువాత మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 20 ఓవర్లతో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు, మోర్రీస్ 2 వికెట్లు, రహ్మాన్, తెవాటియా చెరో వికెట్ తీశారు.

Tags:    

Similar News