RR vs PBKS: రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం
RR vs PBKS: స్కోర్లు : రాజస్థాన్ 144/9 , పంజాబ్ 145/5
RR vs PBKS: IPL మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ప్లే ఆఫ్ రేసులో అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు కళ్లెం వేసింది. పంజాబ్ బౌలర్లు అద్భుతమై బంతులు సంధించి తక్కువపరుగులకే కట్టడిచేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 144 పరుగులు చేసింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ లీగ్ దశలోనే నిష్క్రమించినప్పటికీ గౌరవ ప్రదమైన స్థానం చేజిక్కించుకుంది. పంజాబ్ విజయంలో కీలక పాత్రపోషించిన శామ్ కరణ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.ఇప్పటి దాకా ఐపీఎల్ లో 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ రేసు రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో 10 పాయింట్లను సాధించి పాయింట్ల పట్టికలో 9 స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు, క్యాడ్మోర్ 18 పరుగులు, సంజూ శాంసన్ 18 పరుగులు, ట్రెంట్ బోల్ట్ 12 పరుగులు నమోదు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 144 పరుగులు నమోదు చేసింది.
145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభ ఓవర్లోనే కీలక మైన వికెట్ కోల్పోయింది.ఆతర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లను కోల్పోయింది. లక్ష్యాన్ని చేదించడంలో పంజాబ్ కు ఇబ్బందికరమైందనే పరిస్థితిని కెప్టన్ శామ్ కరణ్ దూరం చేశాడు. 41 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్లతో63 పరుగులు నమోదు చేసి జట్టును విజయ తీరం చేర్చాడు. రీలీరుసో, జితేశ్ శర్మ చక్కటి భాగస్వామ్యంతో పంజాబ్ అద్భుతమైన ఆటతీరుతో రాజస్థాన్ రాయల్స్ పై పంజా విసిరింది.