IND vs PAK: టీం ఇండియాతో జరిగే మ్యాచ్ కు ఈ ఆటగాళ్లు దూరం.. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 ఇదే

IND vs PAK: బాబర్ ఆజం భారత్‌పై పరుగుల వరద పారిస్తాడా.. షహీన్ షా అఫ్రిది బంతితో విధ్వంసం సృష్టిస్తాడా.. మహ్మద్ రిజ్వాన్ తన కెప్టెన్సీతో మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడా.

Update: 2025-02-22 06:40 GMT

IND vs PAK: టీం ఇండియాతో జరిగే మ్యాచ్ కు ఈ ఆటగాళ్లు దూరం.. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 ఇదే

IND vs PAK


బాబర్ ఆజం భారత్‌పై పరుగుల వరద పారిస్తాడా.. షహీన్ షా అఫ్రిది బంతితో విధ్వంసం సృష్టిస్తాడా.. మహ్మద్ రిజ్వాన్ తన కెప్టెన్సీతో మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడా.. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తరపున ఎవరు బాగా రాణిస్తారో రేపు తెలుస్తుంది. కానీ దానికి ముందు భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో జరగనున్న ఈ ఆసక్తికర మ్యాచ్‌లో కొందరు స్టార్ ప్లేయర్లు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పాక్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇమామ్ ఉల్ హక్ అతనికి మంచి సపోర్టు ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతని స్థానంలో ఇమామ్‌ను చేర్చారు. కెప్టెన్ , వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ స్థానంలో సౌద్ షకీల్ ఓపెనర్‌గా వచ్చాడు.. కానీ అతను 19 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సారి అతడి స్థానంలో కమ్రాన్ గులాంకు అవకాశం లభించవచ్చు.అతడి తర్వాత వైస్-కెప్టెన్ సల్మాన్ అగా వస్తాడు. న్యూజిలాండ్‌పై 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లో 49 బంతుల్లో 69 పరుగులు చేసిన ఖుష్దిల్ షా కూడా జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. తయ్యబ్ తాహిర్ న్యూజిలాండ్ పై పరాజయం పాలయ్యాడు.దీంతో భారత్ తో మ్యాచ్ కు అతడు దూరం కావొచ్చు. తైబ్ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి రావచ్చు.

పాకిస్తాన్ జట్టుకు చెందిన ముగ్గురు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి దిగారు. అబ్రార్ అహ్మద్ స్పిన్ లో మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ 10 ఓవర్లలో 63 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా, హారిస్ 10 ఓవర్లలో 83 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. షాహీన్ ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా 68 పరుగులు చేశాడు. అయితే, దుబాయ్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎలాగూ ఆధిపత్యం చెలాయిస్తారు కాబట్టి రిజ్వాన్ తన పేస్ అటాక్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఈ ముగ్గురు బౌలర్లు భారత జట్టుకు కాస్త ప్రమాదకరంగా మారవచ్చు. స్పిన్నర్ అబ్రార్ కూడా జట్టులోనే ఉంటాడు. మొదటి మ్యాచ్‌లో అతను 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు

బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్-వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, కమ్రాన్ గులాం, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, హరిస్ రవూఫ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్.

Tags:    

Similar News