PAK vs NZ: ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి

PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు పాకిస్తాన్ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు స్వదేశంలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Update: 2025-02-15 03:00 GMT

PAK vs NZ: ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి

PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు పాకిస్తాన్ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు స్వదేశంలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వన్డే ట్రై-సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆ జట్టును ఘోరంగా ఓడించింది. ఈ టైటిల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని గెలుచుకుంది. ఫిబ్రవరి 14 శుక్రవారం కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే సులభంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విలియం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.. అతని అద్భుతమైన బౌలింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతను 9.3 ఓవర్లలో 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఫైనల్లో పాకిస్తాన్ జట్టు పెద్దగా స్కోరు చేయలేదు. కానీ దానిని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ విల్ యంగ్ వికెట్ కోల్పోయింది. దీని తరువాత, పాకిస్తాన్ గట్టి బౌలింగ్‌కు వ్యతిరేకంగా పరుగులు సాధించడం కష్టమైంది. అయితే, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లి, రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. కానీ 18వ ఓవర్లో కేన్ విలియమ్సన్ 34 పరుగులు చేసి సల్మాన్ అగాకు వికెట్ సమర్పించుకున్నాడు.

కాన్వే కూడా 108 పరుగుల స్కోరుతో నిష్క్రమించాడు. అతను 48 పరుగులు చేశాడు. దీని తరువాత, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ జట్టు బాధ్యతలు స్వీకరించారు. మిచెల్, లాథమ్ కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో మ్యాచ్ న్యూజిలాండ్ చేతుల్లోకి వచ్చింది. అయితే, మిచెల్ కూడా 195 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతను 58 బంతుల్లో 57 పరుగులను చేశారు. లాథమ్ 64 బంతుల్లో 56 పరుగులు చేసి 232 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివరికి, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ మిగిలిన పరుగులు సులభంగా చేసి మ్యాచ్‌ను గెలిచారు.

బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, పాకిస్తాన్ జట్టు రెండు విభాగాలలోనూ నిస్సహాయంగా కనిపించింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం కివీస్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో, కివీస్ బౌలర్ల ముందు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించారు. ముగ్గురు ఆటగాళ్ళు 54 పరుగులకే పెవిలియన్‌ బాటపట్టారు. అయితే, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అగా 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ వారి జంట విడిపోయిన వెంటనే పాకిస్తాన్ జట్టు చెల్లాచెదురుగా కనిపించింది. రిజ్వాన్ 142 పరుగుల వద్ద 5వ వికెట్‌గా అవుటయ్యాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్ 100 పరుగులు మాత్రమే జోడించగలిగారు. బౌలింగ్ సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొదటి 10 ఓవర్ల తర్వాత కివీస్ జట్టు బ్యాట్స్‌మెన్ పాకిస్తాన్‌కు మ్యాచ్‌లో తిరిగి వచ్చే అవకాశం ఇవ్వలేదు.

Tags:    

Similar News