Champions Trophy Tickets Prices: ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు టిక్కెట్ ధరలను ప్రకటించిన పీసీబీ

Update: 2025-01-27 15:50 GMT

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు టిక్కెట్ ధరలను ప్రకటించిన పీసీబీ  

Champions Trophy Tickets Prices: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే, భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్‌లో ఆడుతుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలను విడుదల చేసింది.

ఈ టోర్నమెంట్‌లోని వివిధ మ్యాచ్‌లకు టిక్కెట్ల ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదాహరణకు, టోర్నమెంట్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు వీవీఐపీ టిక్కెట్ల ధరను రూ.20 వేలుగా నిర్ణయించారు. గ్యాలరీ ధర రూ. 25 వేలుగా ఉంది. విఐపి, ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ ధరలు వరుసగా రూ. 12000, 7000, 4000, 2000 గా ఉన్నాయి. ఈ టిక్కెట్ల ధరలు పాకిస్తాన్ కరెన్సీలో ఉన్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్లు ఎలా కొనాలి?

మొదటి సెమీ-ఫైనల్ మార్చి 5న లాహోర్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు వీవీఐపీ టిక్కెట్ల ధర రూ.20 వేలుగా ఉంది. ఒక్క సీట్ గ్యాలరీ టికెట్ కోసం 25 వేల పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి. ఇది కాకుండా, పీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ ధరలు వరుసగా రూ. 18000, రూ. 12000, రూ. 7000, రూ. 4500 గా ఉన్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్లు కావాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ICCCHAMPIONSTROPHY.COM/TICKETING లోకి లాగాన్ కావాల్సి ఉంటుంది. అలాగే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఫ్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం కోసం TCS ఎక్స్‌ప్రెస్ సెంటర్లు కూడా ఏర్పాట్లు చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఆ తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠరేపే మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంటుంది. మార్చి 2న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News