Operation Sindoor: ఐపీఎల్ వేదిక మార్పు
Operation Sindoor: ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా సాగుతున్న ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ వేదికను మారుస్తూ ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
Operation Sindoor: ఐపీఎల్ వేదిక మార్పు
Operation Sindoor: ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా సాగుతున్న ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ వేదికను మారుస్తూ ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల11వ తేదీన ధర్మశాల వేదికగా జరుగనున్న ముంబై-పంజాబ్ జట్లమ మధ్యమ్యాచ్‌ను అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి మార్చారు. ఐపీఎల్ షెడ్యూలుకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా... ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈరోజు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఆడనుంది. ఈ మ్యాచ్ యధావిధిగా రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఇండోపాక్ సరిహద్దుల్లో షెల్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర, పశ్చిమ నగరాల్లో ఉన్న విమానాశ్రయాలను మూసివేశారు. కొన్నింటిలో ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. మిలిటరీ దాడుల నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయంలో మే 10 వరకు వాణిజ్య విమానాలను రద్దు చేశారు.