Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఇంగ్లాండ్‌లో 25 మంది ఆసియా ఆటగాళ్లలో టాప్ ప్లేస్
Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్ట్‌లో జడేజా తన అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను డ్రా చేయడంలో సాయం చేశాడు. ఇప్పుడు, ఇంగ్లాండ్ గడ్డపై ఆసియాకు చెందిన 25 మంది క్రికెటర్లలో జడేజా ప్రత్యేకంగా నిలిచాడు.
Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఇంగ్లాండ్‌లో 25 మంది ఆసియా ఆటగాళ్లలో టాప్ ప్లేస్
Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్ట్‌లో జడేజా తన అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను డ్రా చేయడంలో సాయం చేశాడు. ఇప్పుడు, ఇంగ్లాండ్ గడ్డపై ఆసియాకు చెందిన 25 మంది క్రికెటర్లలో జడేజా ప్రత్యేకంగా నిలిచాడు. ఇతరులంతా చేసిన పనులే జడేజా కూడా చేశాడు. కానీ, అతను ఆడిన విధానం, చూపిన ప్రభావం మాత్రం వేరే ఎవరూ చేయలేకపోయారు. అందుకే, ఆ 25 మందిలో కూడా రవీంద్ర జడేజా ఒంటరిగా గొప్పగా కనిపించాడు.
ఆసియాకు చెందిన 25 మంది ఆటగాళ్లు ఎవరు? వారి మధ్య జడేజా ఎలా గొప్పగా నిలిచాడో తెలుసా.. ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు లేదా 30 వికెట్లు తీసిన ఆసియా ఆటగాళ్లలో జడేజా ప్రత్యేకంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు చేసిన వాళ్ళు 7 గురున్నారు. 30 వికెట్లు తీసిన వాళ్ళు 18 మంది ఉన్నారు. మొత్తం కలిపితే 25 మంది. ఈ 25 మందిలో రవీంద్ర జడేజా మాత్రం చాలా ప్రత్యేకమైన ఆటగాడు.
రవీంద్ర జడేజా పేరు ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు చేసిన వాళ్ల లిస్ట్‌లో ఉంది. అంతేకాదు, 30 వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్‌లో కూడా అతని పేరు ఉంది. అంటే, ఇంగ్లాండ్‌లో 1000 టెస్ట్ పరుగులు, 30 టెస్ట్ వికెట్లు తీసిన ఒకే ఒక్క ఆసియా ఆటగాడు రవీంద్ర జడేజానే. అందుకే అతడు ఆ 25 మందిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు.
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో 16 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో 42.17 సగటుతో 2 సెంచరీలతో కలిపి 1096 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 48.47 సగటుతో ఇంగ్లాండ్‌లో 34 వికెట్లు తీశాడు. 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అతడి బెస్ట్ బౌలింగ్.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జడేజా నాలుగో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. 4 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో కలిపి 454 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 7 వికెట్లు తీశాడు.