ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

Update: 2019-04-03 13:54 GMT

త్వరలో జరగనున్న ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు 15 మంది ప్రాబబుల్స్ ను ప్రకటించింది. ఈ జాబితాలో రెండో వికెట్ కీపర్‌గా టామ్ బ్లండెల్‌‌కు అవకాశం దక్కింది. ఆరుసార్లు సెమీఫైనల్ వరకు వెళ్లిన కివీస్ ఒక్కసారి కూడా నెగ్గలేదు. గత ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, లాకీ ఫెర్గ్యూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, కోలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోలస్, మిచల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్.

Similar News