Bert Vance: ఒక్క ఓవర్లో 77 పరుగులు ఇచ్చిన న్యూజిలాండ్ స్పిన్నర్

Update: 2021-08-06 12:45 GMT

బెర్ట్ వాన్స్ (ఫైల్ ఫోటో)

Bert Vance: క్రికెట్ లో బ్యాట్స్ మెన్ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్ధి జట్టు బౌలర్ ఆ బ్యాట్స్ మెన్ ని పరుగులు చేయకుండా కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రపంచ క్రికెట్ లో తాము అభిమానించే ఆటగాళ్ళు తక్కువ పరుగులు చేసినా.., బౌలింగ్ లో ఎక్కువ పరుగులు ఇచ్చిన అభిమానులు అసహనానికి, కోపానికి గురవుతూనే ఉంటారు. అయితే అలా బౌలింగ్ లో ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ లో ఒక ఓవర్లో ఎవరు ఇచ్చుకోనాన్ని పరుగులు ఒక ఆటగాడు ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

అతను ఈ మధ్యకాలంలో టీ20 లు, ఐపీఎల్, బిగ్ బాష్ లు ఆడిన ఆటగాడు కాదులెండి. 1990 ఫిబ్రవరిలో షెల్ ట్రోఫీ టోర్నమెంట్ లో భాగంగా న్యూజిలాండ్ దేశానికి చెందిన వెల్లింగ్టన్ మరియు ఇంగ్లాండ్ కి చెందిన కేంటర్బురీ మధ్య జరిగిన ఒక డొమెస్టిక్ మ్యాచ్ లో వెల్లింగ్టన్ బౌలర్ బెర్ట్ వాన్స్ ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి ఈ ఘనతని సాధించాడు.

291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేంటర్బురీ 198/8 పరుగులు చేసి విజయానికి మరో రెండు ఓవర్లలో 93 పరుగులు చేయాల్సి ఉండగా వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ బంతిని ఆఫ్ స్పిన్నర్ అయిన బెర్ట్ వాన్స్ చేతికి ఇచ్చాడు. మొదటి బంతి నుండి వరుసగా నో బాల్స్ వేస్తూ బెర్ట్ వాన్స్ మొత్తంగా 0,4,4,4,6,6,4,6,1,4,2,0,6,6,6,6,6,2,0,4,0,1 లతో 77 పరుగులను సమర్పించుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా కేంటర్బురీ జట్టు 17 పరుగులు సాధించి మ్యాచ్ ని డ్రా గా ముగించింది.

ఇక ఈ ఆఫ్ స్పిన్నర్ ఆటగాడు 1988-89 లో న్యూజిలాండ్ జట్టు తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్ లు, 8 వన్డే మ్యాచ్ లు కూడా ఆడాడు. ఇక బెర్ట్ వాన్స్ ఈ 77 పరుగుల ఒక ఓవర్లో ఇచ్చిన పరుగుల రికార్డునూ ఈ ముప్పై ఏళ్ళలో ఎవరు బ్రేక్ చేయలేకపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎవరు అంత పెద్ద రికార్డునూ బెర్ట్ వాన్స్ ఆటగాళ్ళ ముందుంచాడు. ఇక ఆ మ్యాచ్ తరువాత క్రికెట్ కి గుడ్ బై చెప్పిన బెర్ట్ వాన్స్ వెల్లింగ్టన్ ఒక బట్టల దుకాణం ఓపెన్ చేసి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు.

Tags:    

Similar News