MS Dhoni, Ruturaj Gaikwad: ఐపిఎల్ 2025 నుండి రుతురాజ్ గైక్వాడ్ ఔట్... చెన్నైకి కేప్టేన్‌గా ధోనీ

Ruturaj Gaikwad ruled out of IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కేప్టేన్‌గా వ్యవహరించనున్నాడు.

Update: 2025-04-10 13:21 GMT

MS Dhoni to lead CSK as Ruturaj Gaikwad ruled out of IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. రుతురాజ్ మోచేయి విరగడంతో ఆయన ఐపిఎల్ 2025 నుండి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రేపు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ నుండి ఐపిఎల్ 2025 సీజన్ మొత్తం మహేంద్ర సింగ్ ధోనీ కేప్టేన్‌గా వ్యవహరించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా రుతురాజ్ గైక్వాడ్ గాయం గురించి, కేప్టేన్సీ మార్పు గురించి పోస్టర్ రూపంలో ఎక్స్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గౌహతిలో రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్నాడు. ఎక్స్‌రే తీస్తే అందులో ఏదీ సరిగ్గా తేల లేదు. ఎంఆర్ఐ పరీక్షలు చేశాకే అతడి మోచేతి ఎముక విరిగిందని తెలిసింది. అయినప్పటికీ ఐపిఎల్ సీజన్ ఆడాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యపడటం లేదు. రుతురాజ్ ప్రయత్నాలను అభినందిస్తున్నాం. ఈ ఐపిఎల్ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడలేడు. అందుతే రుతురాజ్ స్థానంలో ఇకపై ధోనీ కేప్టేన్‌గా వ్యవహరిస్తాడు అని చెన్నై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించాడు.

ఏదేమైనా రుతురాజ్ గైక్వాడ్ ఆటను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందని ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తంచేశాడు.

ఈ న్యూస్ అప్‌డేట్ అవుతోంది.

Tags:    

Similar News