IND vs ENG: రిటైర్మెంట్ అయి 4 ఏళ్లయినా చెక్కు చెదరని ధోని రికార్డు
IND vs ENG: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, అతని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
IND vs ENG: రిటైర్మెంట్ అయి 4 ఏళ్లయినా చెక్కు చెదరని ధోని రికార్డు
IND vs ENG: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, అతని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల లిస్టులో ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు ఇంకా ఆ స్థాయిని అందుకోలేకపోయారు.
ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 44 వన్డే ఇన్నింగ్స్‌లలో ధోని 1,546 పరుగులు చేశాడు. అతనికి ఒక శతకం, 10 అర్ధశతకాలు ఉన్నాయి. ఆయన తర్వాత యువరాజ్ సింగ్ 1,523 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 36 వన్డే ఇన్నింగ్స్‌లలో 1,340 పరుగులు సాధించాడు. అతను 3 శతకాలు, 9 అర్ధశతకాలు చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో 1,455 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
* ఎంఎస్ ధోని – 1,546 పరుగులు
* యువరాజ్ సింగ్ – 1,523 పరుగులు
* సచిన్ టెండూల్కర్ – 1,455 పరుగులు
* విరాట్ కోహ్లీ – 1,340 పరుగులు
* సురేష్ రైనా – 1,207 పరుగులు
భారత vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
భారత జట్టు 4-1 తేడాతో T20 సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత, ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతోంది.
* ఫిబ్రవరి 6 – మొదటి వన్డే, నాగ్‌పూర్
* ఫిబ్రవరి 9 – రెండో వన్డే, కటక్
* ఫిబ్రవరి 12 – మూడో వన్డే, అహ్మదాబాద్
ఇంగ్లాండ్ 2018 తర్వాత భారత్‌పై ఏ ఒక్క వన్డే సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. ఈసారి టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.