MS Dhoni: మిస్టర్ కూల్ కి కోపం తెచ్చిన సందర్భాలు ఇవే..

Update: 2021-08-04 13:06 GMT

ధోని (ట్విట్టర్ ఫోటో)

MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ వంటి మ్యాచ్ లలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా చిరునవ్వుతోనే వాటిని ఎదుర్కుంటూ అభిమానులతో మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు. తన కెరీర్ మొదటి నుండి భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడ్డ ధోని భారత జట్టులో స్థానం సంపాదించడమే కాకుండా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా భారత అభిమానుల చిరకాల కోరికను 2 ఏప్రిల్ 2011 రోజున శ్రీలంకపై చివరి ఓవర్లో సిక్స్ కొట్టి భారత్ కి వరల్డ్ కప్ అందించిన రోజు కూడా అంతే కూల్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని మాత్రం క్రీడా మైదానంలో మూడు సందర్భాలలో తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు.

1. 2019 ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా బెన్ స్టొక్స్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ నో బాల్ గా ప్రకటించి ఆ బంతికి జడేజా పరుగు తీయడంతో అంపైర్ తన నో బాల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆగ్రహించిన ధోని ఫీల్డ్ లోకి ఎంటర్ అయి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.



2. దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో టి20లో అప్పటికే 90 పరుగులకు 4 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ధోని, మనీష్ పాండే గ్రీజులో ఉన్నారు. చివరి ఓవర్లో బంతిని సరిగ్గా చూడక ఆడుతున్న మనిష్ పై ధోని కోపంతో ఆటపై దృష్టి పెట్టు అంటూ తన దగ్గరికి వెళ్లి మరి ఆగ్రహాన్ని చూపించాడు.



3. 2018 ఆసియాకప్ లో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో కులదీప్ యాదవ్ వేసిన ఒక ఓవర్లో ప్రతి బంతికి ఫీల్డర్లను మారుస్తూ ఉంటే అసహనానికి గురైన ధోని బౌలింగ్ వేస్తావా లేదా బౌలర్ ని మార్చమంటావా అంటూ తన కోపాన్ని కులదీప్ యాదవ్ పై చూపించాడు.



వ్యక్తిగత కారణాలతో కాకుండా తాను ఆడే జట్టు కోసం 100 శాతం తన ప్రదర్శన కనబర్చాలనే ఒత్తిడిలో ఏ ఆటగాడైన కొన్నిసార్లు తన సహనాన్ని కోల్పోవడం సహజమే. ధోని వంటి కూల్ ఆటగాడు ఇప్పటి జెనరేషన్ ఆటగాళ్లకి ఒక స్ఫూర్తి అనే చెప్పాలి. ప్రపంచ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఐపీఎల్ లో అభిమానులను అలరించడానికి చెన్నై సూపర్ కింగ్స్ తరపున త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News