IPL 2025: నేను చేసిన అతిపెద్ద పాపం అదే.. ఎట్టకేలకు తప్పును ఒప్పుకున్న ధోనీ!

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కూల్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీ ఓ సమయంలో మాత్రం వీధి రౌడిలా బిహేవ్‌ చేశాడు.

Update: 2025-03-18 04:37 GMT

IPL 2025: నేను చేసిన అతిపెద్ద పాపం అదే.. ఎట్టకేలకు తప్పును ఒప్పుకున్న ధోనీ!

MS Dhoni: ఎప్పుడూ ప్రశాంతంగా, ఒత్తిడిని తట్టుకునే తత్త్వానికి చిరునామాగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి 'కెప్టెన్ కూల్' అనే బిరుదు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. కానీ, 2019 ఐపీఎల్‌లో మాత్రం ధోనీ తన సహనాన్ని కోల్పోయిన అరుదైన సందర్భం చోటు చేసుకుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత, ఆ ఘటనను గుర్తు చేసుకున్న ధోనీ దానిని నాటి ఘటనను 'బిగ్ మిస్టేక్'గా అంగీకరించాడు.

ఒక హై-ప్రెజర్ మ్యాచ్‌లో ధోనీ సహనం కోల్పోయాడు. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)పై జరిగిన మ్యాచ్‌ అది. లాస్ట్‌ ఓవర్ ఆరంభంలోనే ధోనీ అవుటయ్యాడు. ఇంకా CSK విజయానికి 18 పరుగుల దూరంలో ఉంది. ఆ సమయంలో బెన్ స్టోక్స్ వేసిన ఓ బాల్‌కు సంబంధించి పెద్ద రచ్చ జరిగింది. ఆ బంతని నో బాల్‌గా ఇవ్వకుండా అంపైర్లు తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపింది.

నిజానికి ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ గాంధే తొలుత నో-బాల్‌గా ప్రకటించాడు. కానీ, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ దాన్ని తిరస్కరించి లీగల్ బాల్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం ధోనీ సహనం కోల్పోయేలా చేసింది. సాధారణంగా.. ఆటలో ఏదైనా వివాదాస్పద నిర్ణయం వచ్చినప్పుడు, ఆటగాళ్లు డగౌట్‌లో ఉండి రియాక్ట్ అవుతారు. కానీ, ఆ రోజు ధోనీ నేరుగా డగౌట్ నుంచి ఫీల్డ్‌లోకి ప్రవేశించి, అంపైర్లతో తీవ్రంగా వాదించాడు. ఇది ఐపీఎల్‌లో చాలా అరుదైన ఘటనలలో ఒకటి. ధోనీ ఫీల్డ్‌లోకి వచ్చి ఓ అంపైర్ నిర్ణయంపై ఇలా నిరసన తెలపడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను షాక్‌కు గురిచేసింది. ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిచినా ధోనీ చేసిన చర్య ఎక్కువ చర్చనీయాంశమైంది.

దీనిపై ధోనీ తాజాగా స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాందిరా బేడీతో మాట్లాడిన ధోనీ, తాను ఆ రోజు ఫీల్డ్‌లోకి వెళ్లడాన్ని పెద్ద తప్పిదంగా భావిస్తున్నానని చెప్పాడు. ఆటలో ఎప్పుడూ ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో ముఖ్యమని, అలాంటి వేళల్లో నిశ్శబ్దంగా ఉండి తప్పించుకోవడమే ఉత్తమ మార్గమని అన్నాడు. ఐపీఎల్‌లోనే కాదు, క్రికెట్‌లో చాలా సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటామని చెప్పిన ధోనీ 2019లో తాను ఫీల్డ్‌లోకి వచ్చిన ఘటన ఒక పెద్ద తప్పిదమని అంగీకరించాడు. ఇలాంటి హై-ప్రెజర్‌ మ్యాచ్‌ల్లో.. ఫ్రస్ట్రేషన్‌ను అదుపులో ఉంచుకోవాలని.. ఏదైనా జరిగినప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ధోనీ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News