MS Dhoni: ధోనీ చేసిన ఈ తప్పు గురించి ఎవరూ మాట్లడరు.. కానీ అదే చెన్నై కొంపముంచింది!

MS Dhoni: మొత్తానికి, ఓ తక్కువ తేడాతో మ్యాచ్ కోల్పోయిన చెన్నైకి, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఈ ఫలితానికి కారణమయ్యాయని అభిమానులు చెబుతున్నారు.

Update: 2025-05-04 07:00 GMT

MS Dhoni: ధోనీ చేసిన ఈ తప్పు గురించి ఎవరూ మాట్లడరు.. కానీ అదే చెన్నై కొంపముంచింది!

MS Dhoni: ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్‌ను ఖలీల్ అహ్మద్‌కు అప్పగించడంపై ఓ అభిమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ ఓవర్‌లో రోమారియో షెఫర్డ్ భారీ షాట్లు కొడుతూ 33 పరుగులు రాబట్టడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.

ఆ సమయానికి సమ్ కరన్ చేతిలో ఓవర్ మిగిలి ఉండగా, ధోని ఎందుకు ఆ ఓవర్‌ను అతనికి ఇవ్వలేదో స్పష్టంగా తెలియకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరి ఓవర్‌కు ముందు చెన్నై విజయం వైపు ఉన్నా, ఆ ఓవర్‌లో భారీ స్కోరు రావడం మ్యాచ్‌ను తిరగరాసింది.

చివరి ఓవర్‌లో చెన్నైకు 15 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ సమయంలో ధోని అవుట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. తరువాత వచ్చిన శివమ్ దూబే తొలి బంతినే సిక్సర్ కొట్టి అది నో బాల్ కావడంతో కొద్దిసేపు ఆశలు మెరుగయ్యాయి. కానీ చివరి మూడు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే రావడంతో చెన్నై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇదిలా ఉండగా, యశ్ దయాల్ నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చినా, చివర్లో ఒత్తిడిలో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ కూడా యశ్‌కు ప్రత్యేక శభాష్ చెప్పారు. అతని కృషి, ప్రిపరేషన్ స్థాయి గురించి మాట్లాడారు. మొత్తానికి, ఓ తక్కువ తేడాతో మ్యాచ్ కోల్పోయిన చెన్నైకి, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఈ ఫలితానికి కారణమయ్యాయని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్‌కు ఇచ్చిన ఓవర్, మ్యాచ్ తీర్వు పై ప్రభావం చూపిందన్న వాదన ఉంది.

Tags:    

Similar News