IPL 2026 Mini Auction: అబుదాబిలో ముగిసిన IPL-2026 మినీ వేలం
అబుదాబి వేదికగా IPL-2026 మినీ వేలం జరిగింది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. వేలంలో 25 కోట్ల 20 లక్షలకు ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL 2026 Mini Auction: అబుదాబిలో ముగిసిన IPL-2026 మినీ వేలం
అబుదాబి వేదికగా IPL-2026 మినీ వేలం జరిగింది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. వేలంలో 25 కోట్ల 20 లక్షలకు ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అతను నిలిచాడు. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను 14 కోట్ల 20 లక్షలకు రికార్డు ధరకు CSK కొనుగోలు చేసుకుంది. వారిద్దరి కోసం చెన్నై 28 కోట్ల పైగా ఖర్చు చేసింది. ఆంధ్ర పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. పృథ్వీ షాను 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు పేరాలను 30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌ను 8 కోట్ల 60 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ చేజిక్కించుకుంది. లుంగీ ఎంగిడిని 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా.. రాహుల్ చాహర్‌ను 5 కోట్ల 20 లక్షలకు CSK సొంతం చేసుకుంది.
ఆసీస్ బౌలర్ బెన్ దుర్హనియస్‌ను 4 కోట్లా 40 లక్షలకు పంజాబ్ దక్కించుకోగా.. ఆకాష్ దీప్‌ను, మాట్ హెన్రిలను KKR, CSK కొనుగోలు చేశాయి. వీరిద్దరిని 2 కోట్ల రూపాయల కనీస ధరకు దక్కించుకున్నాయి. కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను 2 కోట్లకు KKR సొంత చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ను 13 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. పృథ్వీషా, దీపక్ హుడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. టీమిండియా బ్యాటర్ సర్ఫ్‌రాజ్ ఖాన్‌ను 75 లక్షలకు CSK సొంతం చేసుకుంది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని సర్ఫరాజ్‌ను.. ఆఖరి రౌండ్‌లో చెన్నై దక్కించుకుంది. అమిత్ కుమార్‌ను 30 లక్షలకు SRH కైవసం చేసుకుంది. భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్‌ను 5 కోట్ల 20 లక్షలకు RCB చేజిక్కించుకుంది. సైల్ ఆరోరాను 1 కోటి 50 లక్షలకు SRH సొంతం చేసుకుంది. రవిసింగ్‌ను 30 లక్షలకు రాజస్తాన్ కైవసం చేసుకుంది. డానిష్ మలేవార్‌ను 30 లక్షలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. భారత అన్‌క్యాప్డ్ అక్షత్ రఘువంశీని 2 కోట్ల 20 లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను 9 కోట్ల 20 లక్షలకు KKR కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను 7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ మాథ్యూ షార్ట్‌ను CSK 1 కోటి 50 లక్షలకు దక్కించుకుంది. రాహుల్ త్రిపాఠీని 75 లక్షల కనీస ధరకు KKR చేజిక్కించుకుంది. శ్రీలంక స్టార్ ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంకను 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. నమన్ తివారీని కోటి రూపాయాలకు లక్నో సొంతం చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ముకుల్ చౌదరిని 2 కోట్ల 60 లక్షలకు లక్నో కోనుగోలు చేయగా.. తేజస్వీ సింగ్‌ను 3 కోట్లకు KKR సొంతం చేసుకుంది. IPL-2026 వేలంలో మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్ పంట పండింది. రాజస్తాన్‌కు చెందిన కార్తీక్ శర్మను 14 కోట్ల 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. అతన్ని 14 కోట్ల 20 లక్షలకు CSK కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం CSKతో పాటు.. సన్‌రైజర్స్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు CSKకి సొంతమయ్యాడు. భారత వెటరన్ ప్లేయర్ విజయ్ శంకర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఊహించని ధర దక్కింది. 30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని 8 కోట్ల 4 లక్షలకు భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం కోనుగోలు చేసింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హోస్సేన్‌ను 2 కోట్ల కనీస ధరకు CSK సొంతం చేసుకుంది.
మరోవైపు భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను 7 కోట్ల 20 లక్షలకు భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాను 18 కోట్ల భారీ ధరకు KKR చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీని 2 కోట్లకు RCB కైవసం చేసుకుంది. బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అలెన్‌ను KKR దక్కించుకుంది. వీరిద్దరూ 2 కోట్ల బెస్ ధరకు అమ్ముడుపోయారు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను కోటి రూపాయల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. దీపక్ హుడా, కేఎస్ భరత్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం KKR, RCB, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. KKR, లక్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను 2 కోట్ల బెస్‌ప్రెస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ క్రికెటర్ గస్ అట్కిన్సన్, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్, అమ్ముడుపోలేదు.