MS Dhoni: ధోనీని సాగనంపేందుకు ఏర్పాట్లు.. మెడపట్టి మరీ..!

MS Dhoni: తన వల్ల జట్టుకి లాభమా, నష్టమా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది.

Update: 2025-04-13 05:00 GMT

MS Dhoni: ధోనీని సాగనంపేందుకు ఏర్పాట్లు.. మెడపట్టి మరీ..!

MS Dhoni: గెట్ అవుట్ ధోనీ..! నువ్వు ఇక మాకొద్దు..! ఎప్పుడూ మిస్టర్ కూల్ అని పేరొందిన ఆటగాడు.. ఇప్పుడు మాత్రం తన ఆటతోనే ఫ్యాన్స్‌కి చికాకు పెడుతున్నాడు. ఒకప్పుడు ధోని మైదానంలో ఉంటే గెలుపు ఖాయమని నమ్మిన ఫ్యాన్స్‌.. ఇప్పుడు జట్టు ఓటములకు అతడే కారణమంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ధోనీ ఇప్పుడు మాత్రం ఆట మొదలవగానే ఓటమిని స్వీకరించినట్టు ఆడుతున్నాడు. ఇప్పటికీ అతని ఆటగాడిగా జట్టులో కొనసాగడానికి ఉన్న కారణమేంటో ఎవరూ చెప్పలేని స్థితి. టీమ్‌లోనైనా, డ్రెస్సింగ్ రూమ్‌లోనైనా ధోనికి ఎదురు చెప్పే శక్తి ఎవరికీ లేదు అన్న విషయాన్ని చెన్నై ప్రదర్శన స్పష్టంగా తెలుస్తోంది. కేకేఆర్‌పై మ్యాచ్‌లోనూ అది కనిపించింది. 9వ నంబర్‌ బ్యాటర్‌గా ధోనీ ఎందుకు బ్యాటింగ్‌కు వస్తున్నాడో ప్రపంచ క్రికెట్‌ మేధావులకు కూడా అంతుబట్టడం లేదు. కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ధోనీ ఆటతీరులో ఏ మార్పు లేదు. పైగా కేకేఆర్‌పై ఇంకా ఘోరంగా ఓడిపోయింది.

గత సీజన్‌ విజేతగా నిలిచిన జట్టు ఈ సారి మాత్రం ఒకే రకం నిర్లక్ష్య ఆటతీరుతో వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఓటమి సహజమే అయినా, ఒక్క మ్యాచ్‌లోనైనా చివరి వరకు పోరాడే ఆత్మవిశ్వాసం కనపడకపోవడం, అభిమానులను మరింత బాధిస్తున్నది. అటు

ధోనీ బ్యాటింగ్‌లో చురుకుతనం లేకపోవడమే కాకుండా మ్యాచ్ పరిస్థితికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఆడుతున్నాడు. కొంతమంది ప్లేయర్లు ఫామ్‌లో లేకపోవడంతో పాటు సపోర్ట్ స్టాఫ్ నుంచి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం కనిపించకపోవడం వెనుక కూడా ధోని పెత్తనం ఉందనే అభిప్రాయం పెరుగుతోంది.

ఒకప్పుడు ధోని ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి గెలిపిస్తే ఊపిరి పీల్చుకునే అభిమానులు, ఇప్పుడు స్లాగ్ చేయాల్సిన చోట సింగిల్ తీస్తున్నాడని మండిపడుతున్నారు. ఇక ఈ ఏడాది చెన్నై టీం గెలిచిన మ్యాచ్‌లు కూడా ఎగిరి గంతేసేలా లేవు. ప్రత్యర్థి జట్ల తడబాట్ల వల్ల గెలుపు వచ్చినప్పటికీ, చెన్నై ఆటతీరు ఏమాత్రం గెలిచే జట్టులా కనిపించలేదు. అందులోనూ టార్గెట్ 180 దాటితే చెన్నై గెలిచిన సందర్భమే లేదు. అందుకే ఇప్పుడు అభిమానుల మధ్య విపరీత చర్చ నడుస్తోంది. ధోని టీంలో ఉండటం నిజంగా అవసరమా? ఇప్పటికైనా, ధోని ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. తన వల్ల జట్టుకి లాభమా, నష్టమా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది.

Tags:    

Similar News