IPl 2023: ధోనీ పై క్రమశిక్షణా చర్యలు.. ఫైనల్స్ కు దూరం..?

Ban: ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గి చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది.

Update: 2023-05-24 08:00 GMT

Ban: ధోనీ పై క్రమశిక్షణా చర్యలు.. ఫైనల్స్ కు దూరం..??

IPl 2023: ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గి చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో చేసిన ఓ తప్పు కారణంగా ధోనీ పై క్రమశిక్షణ వేటు పడేలా ఉంది. అదే జరిగితే అతడు ఫైనల్స్ కు దూరం కావడం ఖాయం.

అంపైర్లతో ధోనీ వాగ్వాదం అతడికి చేటు తెచ్చేలా ఉంది. విషయం ఏంటంటే, ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో మతీషా బౌలింగ్ కి దిగగా..అంపైర్లు అందుకు అంగీకరించలేదు. మతీషా తొమ్మిది నిమిషాల పాటు గ్రౌండ్ లో లేకపోవడమే ఇందుకు కారణం. అయితే మతీషాను బౌలింగ్ కి అనుమతించకపోవడంపై సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అయిదు నిమిషాల సమయం వృధా అయింది. ఈ విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్ గా పరిగణించింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం..ఒక ఆటగాడు మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్ లో లేకపోతే అతడు ఎన్ని నిమిషాలు మ్యాచ్ లో అందుబాటులో లేడో అన్ని నిమిషాలు అతడు బౌలింగ్ వేయడానికి, బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. మతీషా తొమ్మిది నిమిషాల పాటు మ్యాచ్ లో లేడు...అందుకే అతణ్ని బౌలింగ్ చేసేందుకు అంపైర్లు అంగీకరించలేదు. ఇలా స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ధోనీ అంపైర్లతో వాదనకు దిగడాన్ని గవర్నింగ్ కౌన్సిల్ ఆరా తీస్తోంది. ధోనీ నిజంగా తప్పు చేసినట్లు తేలితే అతడిపై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. అదే జరిగితే ఫైనల్స్ కు ధోనీ దూరం కావడం గ్యారెంటీ.

Tags:    

Similar News