Rayudu: రాయుడిని నలిపేస్తున్న ఇరు జట్ల అభిమానులు.. తప్పెవరిది?
Rayudu: నిజానికి రాయుడు మాటలు ఎవరికీ నచ్చడంలేదు. అతనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rayudu: రాయుడిని నలిపేస్తున్న ఇరు జట్ల అభిమానులు.. తప్పెవరిది?
Rayudu: ఐపీఎల్ అంటే లాయల్టీ. ఆటగాళ్లు, అభిమానులు తమ టీం కోసం ఎంతో ప్రేమను చూపిస్తారు. ఐపీఎల్‌లో అసలైన మజా అలా ఎవరికి వారు తమ జట్టును సమర్థించుకునే విధానంలోనే ఉంటుంది. కానీ అంబటి రాయుడు స్టోరీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా మారింది. రిటైర్ అయ్యి రెండు సంవత్సరాలు దాటిపోయినా చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఆయనకున్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. నిజానికి, అది మరింత పెరిగింది కూడా. కానీ ఈ సీజన్‌లో రాయుడు వైఖరిలో ఊహించని మార్పు చూసి అభిమానులు అవాక్కయ్యారు.
ఇప్పటి వరకూ రాయుడు కామెంట్స్‌లో ధోనీని, చెన్నై టీంని పొగగడం మాత్రమే కనిపించింది. అతడిని చూసిన చాలామంది ధోనీ భజన అని విమర్శించారు. అయితే ఉన్నట్టుండి రాయుడు మాటలు పూర్తిగా మారిపోయాయి. మొదటగా బెంగళూరు జట్టుపై నెగెటివ్ కామెంట్స్ చేసిన రాయుడు.. ఇప్పుడు స్వరం మార్చాడు. "బెంగళూరు జట్టును ఎవరు ఓడించాల్సిన పనిలేదు, వాళ్ళు తమను తాము ఓడించుకుంటారు" అంటూ RCB అభిమానులతో ముందు గొడవపడిన రాయుడు.. ఇప్పుడు వెనక్కి తగ్గాడు. నిజానికి రాయుడు కామెంట్స్ బెంగళూరు అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ రేంజ్ వేరు. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. అందుకే చెన్నైపై వదిలేసి, బెంగళూరును పొగడడం ప్రారంభించాడు రాయుడు. బెంగళూరు సూపర్ ఫామ్‌లో ఉందని.. ఈ సీజన్ కప్ వాళ్లదే అవుతుందని చెప్పేసాడు.
రాయుడి తీసుకున్న ఈ యూ-టర్న్‌తో చెన్నై అభిమానులు విస్మయానికి గురయ్యారు. అదే సమయంలో బెంగళూరు అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు చెన్నై అభిమానులు నమ్మకద్రోహిగా చూస్తుంటే, మరోవైపు బెంగళూరు అభిమానులు అతడిని ఊసరవెల్లిలా చూస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య రాయుడు ఇరుక్కుపోయాడు. ఏ టీంకీ సరిగ్గా నిలబడలేని స్థితిలో.. ట్రోలింగ్‌కు బలయ్యాడు. నిజానికి రాయుడు మాటలు ఎవరికీ నచ్చడంలేదు. అతనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.