Mithali Raj: మిథాలి రాజ్ @ 10,000 రన్స్

Mithali Raj: టీమ్‌ ఇండియా మహిళా వన్డే టీం కెప్టెన్ సారథి మిథాలి రాజ్‌ ఓ కొత్త మైలురాయి చేరుకున్నారు.

Update: 2021-03-12 10:02 GMT

మిథాలి రాజ్ (ఫొటో హన్స్ ఇండియా)

Mithali Raj: టీమ్‌ ఇండియా మహిళా వన్డే టీం కెప్టెన్ మిథాలి రాజ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓ కొత్త మైలురాయి చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3వ వన్డేలో మిథాలి 36 (50 బంతుల్లో 4x4) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ క్రమంలోనే 35 పరుగుల వద్ద ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదివేల పరుగులను చేరుకున్నారు.

1999లో టీమ్‌ ఇండియాలోకి వచ్చిన మిథాలి రాజ్.. ఎంతోకాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో ఆరంగేట్రం చేశారు. 10 మ్యాచ్‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాప్ సెంచరీలున్నాయి. ఇక వన్డే ఫార్మెట్‌లో 212 మ్యాచ్‌లాడిన ఆమె 6,974 (ప్రస్తుత మ్యాచ్‌తో కలిసి) పరుగులు సాధించారు. అందులో ఏడు సెంచరీలు, 54 హాఫ్‌సెంచరీలున్నాయి.

కాగా, టీ20ల్లో 89 మ్యాచ్‌లు ఆడగా 2,364 పరుగులు సాధించారు. ఇక్కడ 17 హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, టీ20, టెస్టు మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇచ్చిన మిథాలి.. వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. రాబోయే ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలబెట్టాలని కలలుకంటున్నారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మిథాలీ రాజ్ కు కంగ్రాట్స్ తెలుపుతూ ట్వీట్ చేశాడు.


Tags:    

Similar News