Asaduddin: షమీ ముస్లిం కావడం వల్లే ఆరోపణలు
*ఇండియా-పాక్ మ్యాచ్ ఓటమికి షమీయే కారణమంటూ ట్వీట్లు *పోస్టులను తప్పుబట్టిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
అసదుద్దీన్ ఓవైసీ - మహ్మద్ షమీ(ఫైల్ ఫోటో)
Mohammed Shami: ఇండియా - పాక్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి మహ్మద్ షమీయే కారణమంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లను తప్పుబట్టిన MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆటలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. జట్టులో 11 మంది సభ్యులు ఉంటే అందులో ఒక్కరిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహ్మద్ షమీ ముస్లిం కావడం వల్లే అతడిపై ఆరోపణలా అని ప్రశ్నించారు. ఈ విషప్రచారాన్ని బీజేపీ ఖండిస్తుందో లేక స్వాగతిస్తుందో సమాధానం చెప్పాలని అన్నారు అసద్.