Maxwell: హద్దులు దాటి మాట్లాడితే ఊరుకోను.. నెటిజన్లకు మాక్స్ వెల్ వార్నింగ్

* నెటిజన్ల ట్రోల్స్ పై మాక్స్ వెల్ ఆగ్రహం

Update: 2021-10-12 08:27 GMT

మాక్స్ వెల్ (ఫోటో: ఐపీఎల్)

Maxwell: ఈ సాలా కప్ నమ్ దే అంటూ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకి ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. సోమవారం ప్లేఆఫ్ మ్యాచ్ లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్ - బెంగుళూరుకి మధ్య జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలై మరోసారి టైటిల్ గెలుస్తామనుకున్న అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లారు. టోర్నీ లీగ్ మ్యాచ్ లలో దాటిగానే ఆడిన బెంగుళూరు జట్టు పాయింట్స్ పట్టికలో 3వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్ కు చేరినా.. క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓటమితో ఆర్సీబి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

డానియల్ క్రిస్టియన్ సోమవారం జరిగిన మ్యాచ్ లో చివరి వరకు క్రీజులో నిలిచినా బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోవడంతో పాటు బౌలింగ్ లో ఒకే ఓవర్లో 22 పరుగులు ఇవ్వడంతో ఆర్సీబి ఓటమికి నువ్వే కారణమంటూ నెటిజన్లు డానియల్ క్రిస్టియన్ తో పాటు అతడి భార్యపై అసభ్యపదజాలంతో ట్రోల్ చేయడంపై మాక్స్ వెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నెటిజన్లు హద్దులు దాటి కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని, ప్రతి మ్యాచ్ లో బాగా ఆడటానికి ప్రయత్నిస్తామని, దురదృష్టవశాత్తూ మేము కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఫైనల్స్ కి చేరలేకపోయామని అయితే ఈ ఏడాది ఐపీఎల్ బెంగుళూరు జట్టుకి మంచి సీజన్ అనే చెప్తూనే.. చెత్త కామెంట్స్ చేసే నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చాడు.

మరోపక్క సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన డానియల్ క్రిస్టియన్ ఈరోజు జరిగిన మ్యాచ్ లో సరిగ్గా ఆడలేదని, ఆ మ్యాచ్ లో ఆడనంత మాత్రాన తన కుటుంబ సభ్యులను ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరైనది కాదంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా తన బాధని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఓడిన తరువాత ఇక ఈ ఏడాది కూడా టైటిల్ గెలువలేకపోయినందుకు విరాట్ కోహ్లి గ్రౌండ్ లో కంటతడి పెట్టాడు.    

Tags:    

Similar News