నమన్ ఓజా తుఫాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్సర్లతో సూపర్ సెంచరీ.. కానీ, మ్యాచ్ గెలవలే..!

నమన్ ఓజా తుఫాన్ ఇన్నింగ్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. కానీ, తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

Update: 2022-01-23 12:36 GMT

నమన్ ఓజా తుఫాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్సర్లతో సూపర్ సెంచరీ.. కానీ, మ్యాచ్ గెలవలే..!

Legends League Cricket: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌(Legends League Cricket)లో నమన్ ఓజా(Naman Ojha) భారీ సెంచరీ సాధించాడు . ఇందులో ఫోర్లు, సిక్సర్ల డోస్ మరీ ఎక్కువగా ఉండటంతో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఓజా తుఫాన్ ఇన్నింగ్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. దీంతో అతను స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. కానీ, జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ధోని స్నేహితుడి ఇన్నింగ్స్‌తో నమన్ ఓజా సెంచరీ కనుమరుగైపోయింది.

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియా మహారాజా వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 20 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి ఛేదించింది. లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా, వరల్డ్ జెయింట్స్‌కు తొలి విజయంగా నిలిచింది.

నమన్ ఓజా 69 బంతుల్లో 140 పరుగులు..

ఇండియా మహారాజా మొత్తం 209 పరుగులు చేసింది. ఇందులో నమన్ ఓజానే 140 పరుగులు సాధించాడు. అతను కేవలం 69 బంతుల్లోనే ఇలాంటి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. అంటే 24 బంతుల్లోనే 114 పరుగులు చేశాడు. ఇంత ఆసక్తికరమైన ఇన్నింగ్స్ తర్వాత జట్టు ఓటమిని ఎలా ఊహించవచ్చు. కానీ, అదే క్రికెట్‌లోని థ్రిల్‌. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది.

ఓజా సెంచరీపై ఇమ్రాన్ తాహిర్ దెబ్బ..

భారత మహారాజా బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వరల్డ్ జెయింట్స్ వికెట్లను పడగొట్టారు. కానీ, ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయాడు. అలాగే ఓజా మెరుపు సెంచరీ కూడా ఓటమిని అడ్డుకోలేకపోయింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 42 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ అద్భుత ఆటను ప్రదర్శించాడు. తాహిర్ బ్యాటింగ్‌తో మిగతావన్నీ విఫలమయ్యాయి. వరల్డ్ జెయింట్స్ ఆరో వికెట్ పతనం తరువాత తాహిర్ కేవలం 19 బంతుల్లో చేసిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో నమన్ ఓజా చేసిన సెంచరీని దెబ్బతీసి మరీ ఇండియా మహారాజా జట్టును ఓటమి వైపు నెట్టాడు. ఇమ్రాన్ తాహిర్ చివరి వరకు 19 బంతుల్లో నాటౌట్‌గా నిలిచాడు. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంటే 52 పరుగుల్లో కేవలం 8 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. తాహిర్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నమన్ ఓజా సూపర్ సెంచరీకి విలువ లేకుండా చేశాడు.

Tags:    

Similar News