LSG VS KKR: లక్నోపై కోల్‌కతా ఘన విజయం
LSG VS KKR: లక్నోపై 8వికెట్ల తేడాతో విక్టరీ
LSG VS KKR: లక్నోపై కోల్‌కతా ఘన విజయం
LSG VS KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోడి అదరగొట్టింది. సాల్ట్ 47 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. నికోలాస్ పూరన్ 45, ఆయుష్ బదోనీ 29, కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు.