KL Rahul :కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..కెప్టెన్సీని తిరస్కరించిన స్టార్ ప్లేయర్
KL Rahul: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
KL Rahul :కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..కెప్టెన్సీని తిరస్కరించిన స్టార్ ప్లేయర్
KL Rahul: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్సీకి నో చెప్పాడు. కెఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఐపీఎల్ కెప్టెన్సీకి సంబంధించినది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ ఆఫర్‌ను రాహుల్ తిరస్కరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాహుల్‌కు కెప్టెన్సీని ఆఫర్ చేసిందని, దానిని అతను అంగీకరించలేదని నివేదిక పేర్కొంది.
కెఎల్ రాహుల్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఆటగాడిగా జట్టుకు మరింత సహకారం అందించాలనుకుంటున్నానని చెప్పాడు. కెఎల్ రాహుల్ జట్టు కెప్టెన్సీకి నిరాకరించిన తర్వాత, ఇప్పుడు అక్షర్ పటేల్ ఢిల్లీ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కెప్టెన్సీ ఈ రెండు పేర్ల మధ్యే జరిగింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు బిడ్డింగ్ చేసి కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేసింది. రాహుల్‌కు గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2020-21లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా, 2022 నుండి 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఢిల్లీలో చేరినప్పుడు కెప్టెన్సీ రేసులో అతడి పేరు ముందంజలో ఉంది.
ఇప్పుడు రాహుల్ ఆటగాడిగా మాత్రమే ఆడాలనుకుంటున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఢిల్లీకి కూడా పని చేస్తుంది. ఐపీఎల్‌లో అత్యంత స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లలో రాహుల్ ఒకరు. 2018 నుండి 2024 వరకు ఆడిన 7 ఐపీఎల్ సీజన్లలో 6 లో తను 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.
రాహుల్ కెప్టెన్ కాకపోతే అక్షర్ కెప్టెన్ కావడం ఖాయం. కానీ సమస్య ఏమిటంటే రాహుల్ లాగా అతనికి ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేదు. ఆటగాడిగా అతను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటితోనూ చాలాసార్లు తనను తాను నిరూపించుకున్నారు. కానీ అతను ఇంకా కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి ఆ అవకాశం ఇస్తుందేమో చూడాలి.