India vs SA: టీమిండియా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

India vs SA: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు కేఎల్ రాహుల్ రూపంలో సమాధానం దొరికింది.

Update: 2021-12-18 09:49 GMT

India vs SA: టీమిండియా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

India vs SA: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు కేఎల్ రాహుల్ రూపంలో సమాధానం దొరికింది. భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టుకు ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. టూర్‌కు ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయపడ్డాడు. దీంతో అతను ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత, భారత జట్టు మేనేజ్ మెంట్ ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న వైస్ కెప్టెన్సీ తదుపరి ఎంపిక. పలువురి పేర్లపై ఊహాగానాలు వచ్చాయి. కానీ, చివరికి కేఎల్ రాహుల్ పేరును ఖరారు చేశారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అజింక్య రహానే చాలా కాలం పాటు భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత 12 నెలల్లో అతని పేలవమైన ఆట తీరు అతని వైస్ కెప్టెన్సీని కూడా ప్రభావితం చేసింది. ఫలితంగా బీసీసీఐ అతడిని తొలగించి, ఈ ఏడాది టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్ శర్మకు టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

దక్షిణాఫ్రికా పర్యటనకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించినట్లు బీసీసీఐ వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల రోహిత్‌ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

రాహుల్ వైస్ కెప్టెన్సీకి గట్టి పోటీదారుగా నిలిచాడు

రోహిత్ శర్మ లేకపోవడంతో, దక్షిణాఫ్రికాలో టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి KL రాహుల్ బలమైన పోటీదారుగా నిలిచాడు. దీనికి ప్రధాన కారణం జట్టులో అతనికి చోటు దక్కడం. టెస్టు సిరీస్‌లో భారత్‌కు మెరుగైన ఆరంభాన్ని అందించడంలో కేఎల్ రాహుల్ బాధ్యత వహిస్తాడు. అతని ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉంది. అతను దక్షిణాఫ్రికాలో కూడా దానిని కొనసాగించాలనుకుంటున్నాడు. కేఎల్ రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ భాగస్వామి కావచ్చు.

అయితే ఈ మ‌ధ్యే బెంగుళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో తొడ కండరాలు పట్టి సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ దాని నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జనవరి 19, 2022 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ దక్షిణాఫ్రికా చేరుకుంటాడు.

Tags:    

Similar News