Viral Video: జోమో జో పఠాన్ పాటకు కింగ్ కోహ్లీ, కింగ్ ఖాన్‎ల డ్యాన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే

IPL 2025 Opening Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 శనివారం కోల్‌కతాలో గ్రాండ్ గా ప్రారంభం అయింది.

Update: 2025-03-23 02:08 GMT

IPL 2025 Opening Ceremony

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 శనివారం కోల్‌కతాలో గ్రాండ్ గా ప్రారంభం అయింది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌కు ముందు, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను స్వయంగా వేదికపై నృత్యం చేయడమే కాకుండా, కింగ్ విరాట్ కోహ్లీ , రింకు సింగ్‌లను కూడా తనతో కలిసి డ్యాన్స్ చేయించాడు. 'జోమో జో పఠాన్' పాటలో కోహ్లీ షారుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. షారుఖ్ ఖాన్, రింకు సింగ్ 'లుట్ పుట్ గయా' పాటకు డ్యాన్స్ ఇరగదీశారు.

షారుఖ్ ఖాన్ KKR సహ యజమాని. మ్యాచ్ ప్రారంభానికి ముందు షారుక్ తో కలిసి అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ వేదికపైకి వచ్చారు. తన పాట 'మేరే ధోల్నా' పాడారు. శ్రేయా ఘోషల్ పాటలకు అభిమానుల సందడి మామూలుగా లేదు. ఆ తర్వాత శ్రేయ 'సామి సామి' పాటతో మరింత జోష్ పెరిగింది. ఆ లైట్ ఎఫెక్ట్స్, శ్రేయ మధురమైన గాత్రం దానిని అద్భుతమైన ప్రదర్శనగా మార్చాయి.


ఇక డ్యాన్స్ కు ముందు షారుఖ్, రింకు, కోహ్లీ మధ్య కొంత సరదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత, షారుఖ్ కోరిక మేరకు, మొదట రింకు అతనితో కలిసి డ్యాన్స్ చేసి, ఆపై కింగ్ కోహ్లీతో డ్యాన్స్ చేశాడు. వీరిద్దరూ 'జోమో జో పఠాన్' పాటకు చేసిన డ్యాన్స్ తో అభిమానులు ఫిదా అయ్యారు. స్టేడియం మొత్తం శబ్దంతో ప్రతిధ్వనించింది. ఇక RCB టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆతిథ్య KKR స్కోరును 175 పరుగులకు పరిమితం చేసింది.

Tags:    

Similar News