Kane Injury Update : కేన్ విలియమ్సన్‌కు గాయం.. ఆందోళనలో న్యూజిలాండ్

Kane Williamson Injury Update: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు‌ సిరీస్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ గాయపడ్డాడు.

Update: 2021-06-09 11:18 GMT

న్యూజిలాండ్ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ (ఫొటో ట్విట్టర్)

Kane Williamson Injury Update: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు‌ సిరీస్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ గాయపడ్డాడు. దీంతో రెండో టెస్టులో రెస్టు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టు చివరి రోజు విలియమ్సన్‌ ఎడమ మోచేతికి గాయం అయింది. ఈమేరకు ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రతను పరిశీలించాడు. గాయం తీవ్రంగా లేదని, రెండ్రోజులు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్ సిరీస్‌ తరువాత జూన్ 18 నుంచి ఇండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో తలపడాల్సి ఉంది. ఈ మేరకు న్యూజిలాండ్ టీమ్ ఆందోళనలో ఉంది. టీమిండియాతో మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విలియమ్సన్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఎలా అని న్యూజిలాండ్ ఆందోళన చెందుతోంది.

ఈ మేరకు న్యూజిలాండ్ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ మీడియాతో మాట్లాడాడు. '' విలియమ్సన్‌ కు గాయంతో పెద్ద ఇబ్బందిలేదు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఆడేది లేనిది ఇంకా నిర్ణయించలేదు. మ్యాచ్‌లోపు కేన్ పరిస్థితిని గమనించి ఓ నిర్ణయం తీసుకుంటాం. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో తొమ్మిది రోజులు సమయం ఉంది. కేన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. ఫైనల్‌ సమయానికి కేన్ పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటాడు. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఆడిన మిచెల్‌ సాంట్నర్‌ ఎడమ చూపుడువేలుకు గాయం అయింది. దీంతో రెండో టెస్టుక అతను అందుబాటులో ఉండడు. అతని స్థానంలో బౌల్ట్‌ రానున్నాడు.'' అని గ్యారీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో కివీస్ జట్టు అద్భుతంగా ఆడింది. కానీ, వర్షంతో మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. కివీస్‌ ఓపెనర్‌ డెవన్‌ కాన్వే సూపర్‌ సెంచరీ సాధించి, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమంటూ ప్రకటించాడు. కాగా, కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మాత్రం రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్‌ రన్‌కే పెవిలియన్ చేరి నిరాశపడిచాడు. ఈ రెండుసార్లు జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో ఔటవ్వడం గమనార్హం. రెండో టెస్టు జూన్‌ 10న ఎడ్జ్‌బాస్టన్‌ లో ప్రారంభం కానుంది. వేదికగా మొదలుకానుంది.


Tags:    

Similar News