IND vs AUS: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్టు నుంచి స్టార్ పేసర్ ఔట్..! టీమిండియాకు పండగే..

Josh Hazlewood: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొదటి టెస్టులోనే టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-11-30 07:54 GMT

IND vs AUS: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్టు నుంచి స్టార్ పేసర్ ఔట్..! టీమిండియాకు పండగే..

Josh Hazlewood: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొదటి టెస్టులోనే టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దృవీకరించింది. హేజిల్‌వుడ్‌ జట్టుతో పాటే ఉంటాడని, రికవరీ అయ్యేవరకూ సీఏ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. పెర్త్‌ టెస్టులో మిగతా ఆసీస్ బౌలర్ల కంటే హేజిల్‌వుడ్‌ ఉత్తమ ప్రదర్శన చేశాడ. ఐదు వికెట్లు తీసి మంచి ఫామ్ మీదున్న అతడు దూరమవడం ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బే అని చెప్పాలి.

నడుము కింది భాగంలో తీవ్ర నొప్పి వచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌కు జోష్‌ హేజిల్‌వుడ్‌ చెప్పాడు. వెంటనే అతడిని పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం అయ్యే పింక్‌బాల్ (డే/నైట్‌) టెస్టుకు అతడు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ కోలుకోకుంటే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే జట్టులో ఉన్న స్కాట్ బోలాండ్‌నే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బోలాండ్‌ చివరగా 2023లో లీడ్స్‌లో జరిగిన యాషెస్ టెస్టు మ్యాచులో ఆడాడు.

సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లు షెఫీల్డ్ షీల్డ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చారు. షెఫీల్డ్ షీల్డ్ చివరి రౌండ్‌లో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో అబాట్ 16 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు 261 ఫస్ట్-క్లాస్ వికెట్స్ తీశాడు. డాగెట్‌ ఇటీవల వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై ఫైఫర్ సాధించాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో 11 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు మెక్‌కేలో ఇండియా ఏతో జరిగిన మ్యాచులో 6/15 కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ప్రైమ్‌మినిస్టర్స్‌ XI జట్టులో ఉన్న బోలాండ్‌.. టీమిండియాతో వార్మప్ మ్యాచ్‌లో నిరూపించుకుంటే రెండో టెస్టు తుది జట్టులో ఉండడం పక్కా.

ప్రైమ్ మినిస్టర్స్ XI స్క్వాడ్:

జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాట్ రెన్షా, జాక్ క్లేటన్, ఆలివర్ డేవిస్, జేడెన్ గుడ్విన్, సామ్ హార్పర్ (కీపర్), చార్లీ ఆండర్సన్, సామ్ కాన్స్టాస్, స్కాట్ బోలాండ్, లాయిడ్ పోప్, హన్నో జాకబ్స్, మహ్లీ బార్డ్‌మాన్, ఐడాన్ ఓ కానర్, జెమ్ ర్యాన్.

Tags:    

Similar News