IPL 2023: ధటీజ్ చెన్నై సూపర్ కింగ్స్.. వ్యూవర్ షిప్ లో ధనాధన్ రికార్డ్..!

IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ దశ పోరు ముగిసి ప్లే ఆఫ్స్ మొదలయ్యాయి.

Update: 2023-05-24 06:48 GMT

IPL 2023: ధటీజ్ చెన్నై సూపర్ కింగ్స్.. వ్యూవర్ షిప్ లో ధనాధన్ రికార్డ్..

IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ దశ పోరు ముగిసి ప్లే ఆఫ్స్ మొదలయ్యాయి. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టీమ్ జోరుకు చెన్నై బ్రేకులు వేయగలదా లేదా అని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను ఎంతో ఉత్కంఠతతో వీక్షించారు. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ను ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఓడించింది. ఇదిలా ఉంటే వ్యూవర్ షిప్ విషయంలో ఈ మ్యాచ్ అరుదైన రికార్డ్ దక్కించుకుంది.

చెన్నై-గుజరాత్ మ్యాచ్ ను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. వ్యూవర్ షిప్ 2.5 కోట్ల మార్క్ ని దాటింది. ఈ మేరకు జియో సినిమా తన ట్విట్టర్ లో వ్యూవర్ షిప్ కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. గతంలో చెన్నై- ఆర్సీబీ మ్యాచ్ కు 2.4 కోట్ల వ్యూవర్ షిప్ రాగా దాన్ని తొలి ప్లే ఆఫ్స్ మ్యాచ్ అధిగమించినట్లయింది.

ఈ 16వ సీజన్ ప్రసార హక్కులను డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో దక్కించుకన్న విషయం మనకు తెలిసిందే. జియో సినిమాలో ఫ్రీగా ఈ మెగా లీగ్ చూసే అవకాశం రావడంతో అభిమానులు ఎగబడి మరీ చూస్తున్నారు. లీగ్ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే అక్షరాలా 147 కోట్ల వీడియో వ్యూస్ సంపాదించింది. ఇక ఇప్పటివరకు అన్ని మ్యాచులు కలిపి దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్ ను జియో సినిమా క్రాస్ చేసింది.

మొత్తంగా, ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకపోవడంతో జనాలు యథేచ్ఛగా ఐపీఎల్ మ్యాచులు చూస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒరియా, బంగాలీ, భోజ్ పురి, గుజరాతీ, మరాఠీ సహా మొత్తం 12 భాషల్లో జియో సినిమా అభిమానులకు ఐపీఎల్ లైవ్ అందిస్తోంది. 

Tags:    

Similar News