Jhulan Goswami: ఇవాళ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న జులన్ గోస్వామి
Jhulan Goswami: ఇంగ్లాండ్‌తో ఆడనున్న మూడో వన్డే జులన్ కెరీర్‌లో ఆఖరు మ్యాచ్
Jhulan Goswami: ఇవాళ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న జులన్ గోస్వామి
Jhulan Goswami: టీమిండియా మహిళల క్రికెట్ దిగ్గజం.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఇవాళ క్రికెట్‌కు గుడ్ బై పలకనున్నారు. ఇంగ్లండ్ మహిళల జట్టుతో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఈరోజు జరిగే మూడో వన్డేతో జులన్ గోస్వామి కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ కానుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జులన్ గోస్వామి 19 ఏళ్ల 262 రోజుల సుదర్ఘ తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకనుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జులన్ గోస్వామి.. భారత మహిళల క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. ఫాస్ట్ బౌలర్ గా జట్టులోకి అడుగుపెట్టినా.. కీలక సమయాల్లో ఆమె బ్యాట్ తోనూ రాణించి జట్టుకు విజయాలను అందించింది. క్రికెట్ కెరీర్ తనకెంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇన్నాళ్లు క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించానని తెలిపారు.