MS Dhoni: మెంటార్ గా మహేంద్రుడి వ్యూహం బెడిసికొట్టిందా..!?

Update: 2021-11-01 09:51 GMT

MS Dhoni: మెంటార్ గా మహేంద్రుడి వ్యూహం బెడిసికొట్టిందా..!?

MS Dhoni - Team India: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా మెంటార్ గా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోని వ్యూహాలు బెడిసికొట్టాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ ఓటమితో మెంటార్ గా ధోని ఇచ్చిన సలహాలను కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టించుకోవట్లేదని వార్తలు వినిపించిన తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు మార్పులో ధోని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఆదివారం కివీస్ తో జరిగే మ్యాచ్ కి ముందు ధోని ఆటగాళ్ళతో చాలాసేపు మాట్లాడటం టివిల్లో చూశాము. మరోపక్క భారత జట్టుకు సంబంధించి సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్ టాగూర్ ని తుదిజట్టులోకి తీసుకున్నాడు. అల్ రౌండర్ హార్దిక్ పాండ్యని పట్టుబట్టి తుదిజట్టులో ఉంచాలని ధోని కోరినట్టు తెలుస్తుంది. ఇక ఓపెనర్ గా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలని ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లను పంపడంతో పాటు రోహిత్ శర్మని మూడో స్థానంలో, నాల్గో స్థానంలో విరాట్ కోహ్లి రావాలని ధోని సూచించినట్టు తెలుస్తుంది.

అయితే కొంతమంది మాజీ ఆటగాళ్ళు మాత్రం ఓపెనర్ గా రోహిత్ శర్మని పంపి రాహుల్ ని మిడిల్ ఆర్డర్ లో పంపాల్సిందని, ఆ విషయంలో ధోని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మూడో స్థానంలో ఆడిన విరాట్ కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, కివీస్ తో జరిగిన మ్యాచ్ లో తక్కువ పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమై, బౌలింగ్ కూడా చేయని హార్దిక్ పాండ్య స్థానంలో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ని తీసుకొని ఉంటె బాగుండేదని క్రీడాపండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరి ధోని, రవిశాస్త్రి, విరాట్ కోహ్లి మధ్య ఏకాభిప్రాయం లేకనో, ధోని వ్యూహాలు ఫలించకనే లేదా ఐపీఎల్ పూర్తైన తరువాత వెంటనే టీ20 వరల్డ్ కప్ మొదలవడంతో ఆటగాళ్ళకు విశ్రాంతి లేకనో తెలియదు కాని భారత జట్టు మాత్రం ఘోరంగా విఫలమై కోట్లాదిమంది అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లింది.

Tags:    

Similar News