IPL Mini Auction 2026: ఐపీఎల్ వేలంలో కేకేఆర్ నయా రికార్డ్.. రూ.25 కోట్లకు గ్రీన్ సొంతం.. పృథ్వీ షా, సర్ఫరాజ్‌లకు భారీ షాక్!
IPL Mini Auction 2026: దుబాయ్‌లో ఐపీఎల్ మినీ వేలం కొనసాగుతోంది. 350 మంది ప్లేయర్లు వేలంలో ఉండగా... దేశీయ ప్లేయర్లు 240 మంది ఉన్నారు.
IPL Mini Auction 2026: దుబాయ్‌లో ఐపీఎల్ మినీ వేలం కొనసాగుతోంది. 350 మంది ప్లేయర్లు వేలంలో ఉండగా... దేశీయ ప్లేయర్లు 240 మంది ఉన్నారు. అయితే ఇండియన్ ప్లేయర్లకు ఈ ఆక్షన్‌లో నిరాశే మిగిలింది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్, కేఎస్ భరత్, దీపక్ హుడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. విదేశీ ప్లేయర్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ మెక్‌గర్క్... న్యూజిలాండ్ ప్లేయర్లు కాన్వే, రచిన్ రవీంద్ర... ఇంగ్లండ్ ప్లేయర్ అట్కిన్సన్, లివింగ్ స్టోన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
ఇప్పటివరకు జరిగిన వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధరకు సేల్ అయ్యాడు. గ్రీన్‌కు కనీస ధర 2 కోట్లు ఉండగా.. కేకేఆర్, ఆర్ఆర్, సీఎస్కే అతన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరగా 25 కోట్ల 20 లక్షలకు కోల్‌కతా అతన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్ మతీషా పతిరణ అధిక ధర పలికాడు. పతిరణను కోల్‌కతా 18 కోట్లకు సొంతం చేసుకుంది. భారత ప్లేయర్లలో రవి బిష్ణోయ్ 7 కోట్ల 20 లక్షలు పలకగా.. రాజస్థాన్ సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్‌ను 7 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు దక్కించుకోగా.. శ్రీలంక ప్లేయర్ హసరంగను లక్నో 2 కోట్లకు దక్కించుకుంది. డికాక్‌ను ముంబై, బెన్ డకెట్‌ను ఢిల్లీ బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకున్నాయి.