IPL 2021: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించలేం: గంగూలీ

IPL 2021: ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Update: 2021-05-10 15:45 GMT

గంగూలీ (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీపీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు ఓ స్పష‌్టత నిచ్చారు. ఇప్పటికే దాదాపు లీగ్ మ్యాచ్‌లు సగం వరకు పూర్తయ్యాయి. అయితే మిగతా మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశమే లేదని వెల్లడించారు. భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరలా అన్ని టీంలను 14 రోజుల క్వారంటైన్ ఉంచడమంటే సాధ్యం కాదని అన్నారు.

కాగా, ముంబయి, చెన్నై స్టేడియాల్లో మ్యాచ్‌లు సక్రమంగానే జరిగాయి. అక్కడి నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌కు మ్యాచ్‌లను షిప్ట్ చేశారో.. అప్పుడే బయో బుడగ వీక్‌గా మారింది. అటు, ఇటు తిరగడంతో ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కోల్‌కతా టీంలో వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ కరోనా బారిన పడగా, హైదరాబాద్‌ టీంలో వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీలో అమిత్‌ మిశ్రా, చెన్నై టీంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు మైక్‌ హస్సీ, లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌ గా నమోదైంది. దీంతో ఐపీఎల్ 14 సీజన్‌లో మిగతా మ్యాచ్‌లను నిలిపేశారు.

'ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఐపీఎల్ నిర్వహించడం చాలా కష్టం. అన్ని టీంల ఆటగాళ్లను క్వారంటైన్‌ లో మరలా ఉంచాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మిగతా సీజన్‌ ను ఇండియాలో నిర్వహించడం కుదరని పని. ఇక ఐపీఎల్‌ను ఎప్పుడు నిర్వహిస్తామో ప్రస్తుతమైతే చెప్పలేం. పరిస్థితులు అనుకూలించాక ఐపీఎల్ నిర్వహాణపై ఓ నిర్ణయం తీసుకంటామని' గంగూలీ పేర్కొన్నారు.

Tags:    

Similar News