ఐపీఎల్-22 టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్

IPL 2022: *రాజస్థాన్ రాయల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం *సీజన్‌లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టీమ్

Update: 2022-05-30 01:34 GMT

ఐపీఎల్-22 టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్

IPL 2022: ఐపీఎల్-22 పైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత రికార్డు బ్రేక్ చేసింది. సీజన్ లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టీం తొలిసారే కప్ ఎగరేసుకుపోయింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోడీ స్టేడింయలో హోరా హోరీగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్సి పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైనాస్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజాస్తన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు సాధించింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే గుజరాత్ చేధించింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లు శుభమన్ గిల్ 43 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్య 34, డేవిడ్ మిల్లర్ 32 పరుగుల సాహా ఐదు, వెడ్ 8 పరుగులు చేశారు. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఇంకా ఓవర్లు మిగిలి ఉఇండగానే టార్గెట్ రీచ్ అయి.. కప్ సొంతం చేసుకుంది గుజరాత్ టైన్స్ టీం.

పరుగులు నియంత్రించడంలో రాజస్థాన్ బౌలర్లు కొంత వరకు సఫలీకృతులయ్యారు. అయితే గుజరాత్ కెప్టెన్ హార్ధిక పాండ్యా, శుభమన్ గిల్ చక్కటి భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. చాహల్ బౌలింగ్ లో పాండ్యా వెనుతిరిగినా.. ఆ తర్వాత క్రీజ్ లోకి అడుగుపెట్టిన డేవిడ్ మిల్లర్, శుభ్ మన్ గిల్ సహాయంతో జట్టును విజయపథంలో నడిపించారు. రాజస్థాన్ బౌలర్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. గిల్ ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించడంతో రెండోసారి టైటిల్ సాధించాలన్న రాజస్థాన్ రాయల్స్ కల నెరవేరలేదు.

 కాగా, ఐపీఎల్ తాజా సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్రోఫీతో పాటు 20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 13 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా, క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 7 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్ 6.5 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. గతంలో భారత్ ను వన్డేల్లో వరల్డ్ కప్ విజేతగా నిలిపిన గ్యారీ కిర్ స్టెన్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఎక్కడా పెద్దగా హంగామా లేకుండానే, అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం కిర్ స్టెన్ స్టయిల్. ఐపీఎల్ తాజా సీజన్ ద్వారా అది మరోసారి స్పష్టమైంది.

Tags:    

Similar News