IPL 2025: క్రికెట్‌ లవర్స్‌కు భారీ షాక్‌.. IPL షెడ్యూల్‌లో మార్పు? ఆ టీమ్‌ మ్యాచ్‌లపై సస్పెన్స్!

IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడాల్సిన ఓ మ్యాచ్‌ సస్పెన్స్‌ నెలకొంది. అధికారులకు భద్రతా ఏర్పాట్లలో సవాళ్లు ఎదురవుతున్నాయి.

Update: 2025-03-19 05:06 GMT

IPL 2025: క్రికెట్‌ లవర్స్‌కు భారీ షాక్‌.. IPL షెడ్యూల్‌లో మార్పు? ఆ టీమ్‌ మ్యాచ్‌లపై సస్పెన్స్!

IPL 2025: IPL అంటే క్రికెట్‌ ప్రేమికులకు పండుగ. ప్రతి ఏడాదీ ఈ లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే, 2025 సీజన్ షురూ కాక ముందే ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది.ఈ మ్యాచ్ రామ్ నవమి పండుగ రోజున రావడంతో స్థానిక అధికారులకు భద్రతా ఏర్పాట్లలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదే కారణంగా, బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) బీసీసీఐకి లేఖ రాసి మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్ మార్చడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. దీంతో, మ్యాచ్‌ను కోల్‌కతా నుంచి వేరే వేదికకు మార్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి గతేడాది కూడా ఎదురైంది. అప్పుడు కూడా కోల్‌కతాలో ఓ మ్యాచ్ రామ్ నవమితో సమానమైన సమయంలో పడడంతో మార్పులు చేసిన అనుభవం ఉంది. అయితే, ఈ సారి అదే పద్ధతిలో మార్పులు చేయగలరా అన్నది సందేహంగా మారింది.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో KKR, LSG కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహించనుండగా, లక్నో జట్టును రిషభ్ పంత్ ముందుండి నడిపించనున్నాడు. ఇలాంటి కీలకమైన సమయానికి హోం వేదిక కోల్పోతే KKRకు ఇది భారీ వెనుకడుగు అవుతుందనడంలో సందేహం లేదు. అభిమానులు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. IPL అభిమానులకు ఇది ఒక చిన్న అసంతృప్తి అయినా, లీగ్ ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News