MS Dhoni: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. చెన్నై కెప్టెన్‌గా తలా వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు ర్యాంపే!
MS Dhoni: చెపాక్ వేదికగా ఢిల్లీపై మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
MS Dhoni: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. చెన్నై కెప్టెన్‌గా తలా వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు ర్యాంపే!
MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మళ్లీ ఒక చిన్న ఆశ చిక్కింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా డిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఒకసారి ఎంఎస్ ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని సమాచారం.
చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగబోయే మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ మీడియాతో మాట్లాడారు. రుతురాజ్ గాయం పై పూర్తి స్పష్టత శుక్రవారం ట్రైనింగ్ సెషన్ తర్వాతే వచ్చేది అన్నాడు. గుహాటీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ ఎల్బోకు గాయమవడంతో అతను పూర్తి ఫిట్‌గా కనిపించటం లేదు.
రుతురాజ్ ఫిట్‌నెస్ ఒకవేళ నెగెటివ్‌గా వస్తే, ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చాడు. గతేడాది ధోని కెప్టెన్సీలో చెన్నై ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. తర్వాత రుతురాజ్‌కి నాయకత్వం అప్పగించారు. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మళ్లీ "తల"ని ముందుకు నెట్టే ఆలోచన ఆ జట్టు మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తోంది.
ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం మ్యాచ్ రోజునే తీసుకునే అవకాశం ఉంది. ధోనికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఎంతైనా ఐదు టైటిల్స్ అందించిన సీనియర్ కెప్టెన్. అయితే ఈసారి ఆయన "స్టాండ్ ఇన్" లీడర్‌గా రంగంలోకి దిగతాడా..? లేక రుతురాజ్ గాయం పూర్తిగా కోలుకుంటాడా..? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.