IPL 2025: పంత్‌కు అండగా నిలిచిన ధోనీ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటో

IPL 2025: ఐపీఎల్ 2025లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌ వ్యక్తిగతంగా మంచి ఫారమ్ చూపినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓటమి పాలయ్యారు.

Update: 2025-04-16 05:32 GMT

IPL 2025: పంత్‌కు అండగా నిలిచిన ధోనీ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటో

IPL 2025: ఐపీఎల్ 2025లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌ వ్యక్తిగతంగా మంచి ఫారమ్ చూపినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓటమి పాలయ్యారు. బ్యాటింగ్‌కు ముందుగా వచ్చిన లక్నో జట్టు నెమ్మదిగా ఆడింది. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండటంతో భారీ స్కోరు చేయలేకపోయారు. ఏడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్లు త్వరగా అవుట్ అయ్యారు.

ఆ తర్వాత పంత్‌ నిలకడగా ఆడి 49 బంతుల్లో 63 పరుగులు చేశాడు. కానీ చివరకు ఈ పరుగులు ఫలితం ఇవ్వలేదు. మ్యాచ్ చివర్లో ఉత్కంఠతగా సాగింది. ఇన్నింగ్స్ చివర్లో ధోని మరోసారి తన మేజిక్ చూపించాడు. 43 ఏళ్ల ధోని చివరి ఓవర్లలో షార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌ను సునాయాసంగా ఆడుతూ 3 బంతులు మిగిలి ఉండగానే చెన్నైకు విజయాన్ని అందించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, అతని 4వ ఓవర్ ఇవ్వకపోవడం పంత్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయమని విమర్శలు వచ్చాయి. బిష్ణోయ్ మంచి ఫారమ్‌లో ఉండగా, అతన్ని చివరి వరకు ఆడనివ్వకపోవడం LSGకు నష్టంగా మారింది. షార్దూల్ ఠాకూర్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. అతను 4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

మ్యాచ్ అనంతరం పంత్‌ మాట్లాడుతూ.. 'మేము కనీసం 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాం. మంచి మూమెంటంట ఉన్న సమయంలో వికెట్లు కోల్పోయాము. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది, కానీ ఇంకొన్ని పరుగులు చేయాల్సింది' అని చెప్పుకొచ్చాడు. ఇక రవి బిష్ణోయ్ గురించి మాట్లాడుతూ.. 'చివరిలో అతనిని మరో ఓవర్ వేయించాలనుకున్నాం కానీ జరుగలేదు. పవర్‌ప్లేలో మా బౌలింగ్‌పై మేము పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రతీ మ్యాచ్ నుంచి పాజిటివ్‌లను తీసుకుని ముందుకు సాగాలని చూస్తున్నాం' అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధ పంత్‌లో స్పష్టంగా కనిపించింది. సీఎస్‌కే గెలవగానే అతను ఎమోషన్‌కు గురయ్యాడు. అయితే ఈ సందర్భంగా ధోనీ చేసిన ఓ పని అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ అనంతరం ధోని నెమ్మదిగా పంత్‌ దగ్గరకు వెళ్లి అతనిని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.



Tags:    

Similar News